Ganta : నన్ను జిల్లా నుండి పంపేద్దాం అనుకుంటున్నారా ?

0

  • అధిష్టానం పొమ్మనలేక పార్టీ పోగబెడుతోందా ? 
  • బోత్స మీద పోటీకి ఆసక్తి చూపని గంటా ! 
  • మరో నియోజకవర్గం కేటాయిస్తుందా ?

ఎన్నికలొచ్చిన ప్రతీసారి నియోజకవర్గం మారే అలవాటు ఉన్న గంటా శ్రీనివాస రావుకు కొత్త చిక్కు వచ్చి పడిరది. అయితే ఈ సారి చీపురుపల్లి స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచించింది. కానీ అంతదూరం వెళ్ళటం గంటాకు ఇష్టం లేదు. పైగా అది వేరే జిల్లా కావటంతో పోటీకి అయిష్టంగా ఉన్నారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ నాకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది.  నేను విశాఖ నార్త్‌ నుండి పోటీ చేయడం లేదు. విశాఖ నార్త్‌ లో వేరే ఇన్‌ ఛార్జ్‌ ని పెట్టమన్నా. నన్ను చీపురుపల్లి వెళ్లమని పార్టీ చెప్పింది. కానీ చీపురుపల్లిపై నేను నిర్ణయం తీసుకోలేదు. చీపురుపల్లి పక్క జిల్లాలో ఉందని, దాదాపు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలన్నారు. అక్కడ పోటీ తనకు సరిపోతుందా? లేదా? అన్న విషయాన్ని కార్యకర్తలు, అభిమానులతో చర్చించి హైకమాండ్‌ కు తన నిర్ణయాన్ని చెబుతానన్నారు. ఇంకా టీడీపీ, జనసేన సీట్ల లెక్క తేలలేదు. కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చింది. వారం రోజుల్లో జాబితా ప్రకటించే అవకాశం ఉంది. నేనైతే ఈ జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నాను. నన్ను ఈ జిల్లా నుండి పంపేద్దాం అనుకుంటున్నారా?. పార్టీ నాయకులకు నా అభిప్రాయాలు చెప్తాను. రెండు రోజుల్లో నిర్ణయం ఏంటన్నది చెప్తాను. ప్రతీ ఎన్నికల్లో నేను నియోజకవర్గం మారుతున్నా. కానీ ఇప్పుడు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది అని గంటా అంటున్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !