దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల తుది కీ విడుదలైంది. ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జెఈఈ మెయిన్ సెషన్ -1 ను నిర్వహించింది. ఇవాళ తుది కీని విడుదల చేసింది. త్వరలోనే పర్సంటైల్ ఫలితాలను వెల్లడిరచనుంది. జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలకు 12,95,617 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 12,25,529 మంది హాజరయ్యారు. తుది కీ కోసం https://jeemain.nta.ac.in/ లేదా https://nta.ac.in/NoticeBoardArchive ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి జేఈఈ మెయిన్ సెషన్ -1 తుది కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దుమ్మురేపిన నారాయణ !
నేడు విడుదలైన తుది ‘కీ’ని ఫలితాలను అనుసరించి 6 గురు నారాయణ విద్యార్థులు 300/300 మార్కులు సాధించనున్నట్లు నారాయణ విద్యాసంస్థల అకడమిక్ డ్కెరెక్టర్ పి. ప్రమీల తెలిపారు. యం. సాయితేజ (240310661132), షేక్ సూరజ్ (240310038821), ఆర్యన్ ప్రకాష్ (240310099049), పి. రోహన్ సాయి (240310106660), హెచ్ విదిత్ (240310608827), యం. అనూప్ (240310552251) 300ల మార్కులకు గాను 300 మార్కులు సాధించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 10 మంది విద్యార్థులు 300/300 మార్కులు తెచ్చుకోగా వారిలో 6 గురు నారాయణ విద్యార్థులే కావటం గమనార్హం. ఈ రికార్డు నారాయణకు తప్ప దేశంలో మరి ఏ ఇతర విద్యాసంస్థ సాధించలేదని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ ఎంట్రన్స్‌ల శిక్షణకు నారాయణకు నారాయణే సాటి అని మరోసారి ఈ ఫలితాలతో నిరూపించామిని తెలియజేశారు. కాగా తెలంగాణ నుండి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుండి ఒకరు, ముంబై (మహారాష్ట్ర) నుండి ఒకరు ఈ ఘనత సాధించినట్లు చెప్పారు. ఏప్రిల్‌లో జరిగే మరో విడత జెఈఈ మెయిన్ పరీక్షలోనూ మరింత మంది 300/300 మార్కులు సాధించనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్.విదిత్ 7 వ తరగతి నుండి, సాయితేజ 8 వ తరగతి నుండి అనూప్ 9 వ తరగతి నుండి నారాయణ స్కూల్స్‌లో చదువుతుండగా, షేక్ సూరజ్ 5 వ తరగతి నుండి నారాయణ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసినట్లు తెలుస్తోంది.