NARAYANA : నారాయణలో సోదాల కలకలం !

0


ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నెల్లూరు నగరం చింతారెడ్డిపాళెంలోని నారాయణ వైద్య కళాశాల క్యాంపస్‌లో నిషేధిత మందుల విక్రయాలు జరుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసు బలగాలతో కలిసి ఔషధ నియంత్రణాధికారులు శుక్రవారం తనిఖీలు జరిపారు. తొలుత డ్రగ్స్‌ అధికారులు నారాయణ వైద్య కళాశాల, డెంటల్‌ కళాశాలకు మధ్య ఉన్న డూప్లెక్స్‌ భవనంలో సోదాలు జరిపారు. ఆ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న కొంతమంది విద్యార్థులు మత్తు మందులు వాడుతూ వాటికి బానిస అవుతున్నారంటూ వారి తల్లిదండ్రులు పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. సోదాల్లో ఔషధ నియంత్రణశాఖ అధికారులు పాల్గొన్నారు. 

తమ ఆధీనంలోకి తీసుకుని...

ఇదే అదునుగా శుక్రవారం నాడు నారాయణ ఇంట్లో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఆయన ఇంటి దగ్గరున్న అన్ని వాహనాలనూ తనిఖీ చేశారు. నారాయణ నివాసం, ఆస్పత్రి వద్ద పోలీసులు హడావుడి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే నారాయణ ఇంటిని, మెడికల్‌ కాలేజీని పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. నారాయణ సతీమణి రమాదేవిని సుదీర్ఘంగా విచారణ జరిపారు. అసలు ఎందుకు సోదాలు జరుపుతున్నారో.. ఏ విషయంలో ఇంతగా తనిఖీలుగా చేస్తున్నారో కనీస సమాచారం లేకపోవడం గమనార్హం. నిషేధిత ఔషధాలు, డ్రగ్స్‌ మరియు ఇతర మత్తు పదార్థాల కోసం ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎలాంటి డ్రగ్స్‌ దొరికినా కేసులో ఇరికించాలనే ఉద్ధేశ్యంతో పాటు నగదు మరేదైనా డాక్యుమెంట్స్‌ని స్వాధీనం చేసుకుని ఇబ్బంది పెట్టేందుకే ఈ చర్యకు పాల్పడ్డారని తెలుగుదేశం శ్రేణులు విమర్శిస్తున్నాయి.

ఇందుకేనా ఇదంతా..?

కాగా.. 2019 ఎన్నికల్లో నారాయణపై వైసీపీ తరఫున అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పోటీచేసి అతి తక్కువ మెజార్టీతోనే గట్టెక్కారు. అయితే రాబోయే ఎన్నికల్లో కూడా నారాయణ టీడీపీ అభ్యర్థిగా దాదాపు కన్ఫామ్‌ అయ్యారు. ఈసారి అనిల్‌ ఇక్కడ్నుంచి పోటీచేయట్లేదు. నరసారావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీంతో నెల్లూరు నగరపాలక సంస్థడిప్యూటీ మేయర్‌గా ఉన్న ఎండీ ఖలీల్‌ను వైసీపీ బరిలోకి దింపుతోంది. కొత్త వ్యక్తి, ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తి కావడంతో.. నారయణను బలహీనపరచడానికి ఇలా టార్గెట్‌ చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !