BRS : దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు !

0

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ చాలా సీరియస్‌ గా ఉంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకునేలా బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రణాళికలు రూపొందించింది. ఈ తరుణంలోనే..ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై స్పీకర్‌ కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు . కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటువేయాలని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కాగా నిన్ననే స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కలవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అనుకున్నారు. అనర్హత పిటిషన్‌ సమర్పించేందుకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. దీంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఆయన ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఇంటికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, మాగంటి గోపీనాథ్‌, కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌ వెళ్లగా స్పీకర్‌ అందుబాటులో లేరు. దాదాపు రెండు గంటలపాటు నిరీక్షించినా ఫలితం లేకుండా పోయింది. రాత్రి 8.30 గంటల వరకు ఆయన కోసం ఎమ్మెల్యేలు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంట్లో లేకపోవడంతో స్పీకర్‌కు ఎమ్మెల్యేలు ఫోన్‌ చేసినా స్పందించలేదు. దీంతో ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వెనుదిరిగారు. స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చి తమను కలవకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడితోనే తమను కలువలేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మరోసారి దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్‌ సమర్పించేందుకు ప్రయత్నిస్తామని పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు.  ఇక ఇవాళ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు. మరి ఈ ఫిర్యాదుపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

3 నెలల్లో అనర్హత వేటు పడటం ఖాయం !

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కచ్చితంగా డిస్‌క్వాలిఫై అవుతారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. మూడు నెలల్లో దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడడం ఖాయమని పేర్కొన్నారు. దానంపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మా పార్టీలో గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరినందుకు దానం నాగేందర్‌పై తీసుకోవాలి. స్పీకర్‌ సైతం కచ్చితంగా పరిశీలిస్తాం, యాక్షన్‌ తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్‌ రెడ్డి గతంలో ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి అన్నారు. మరి ఈ రోజు రాళ్ల తోటి కొట్టి చంపుతారా నేను అడుగుతున్నాను. తెలంగాణ ప్రజలకు ఏమని సమాధానం చెబుతారు? దానం నాగేందర్‌ పంజాగుట్ట బార్‌ దగ్గర బీడీలు అమ్ముకుంటాడని విమర్శలు చేసిన మీరు ఎందుకు తీసుకున్నారు? బీఆర్‌ఎస్‌ బీఫామ్‌ మీద గెలిచి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లిన అతడు కచ్చితంగా డిస్‌క్వాలిఫై కాబోతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌ ప్రకారం మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలి. మూడు నెలల లోపల దానం నాగేందర్‌ డిస్‌క్వాలిఫై కాబోతున్నాడు. రేవంత్‌ రెడ్డి దానం నాగేందర్‌ చేరిక సందర్భంగా బాగా నవ్వుతున్నారు. మీరు కొట్టారు మేము తీసుకున్నాము. మేము కొట్టినప్పుడు మీకు చావు దెబ్బే. మేం గేట్లు తెరిస్తే మొత్తం వస్తారు అంటున్నారు. మేమింకా గేట్లు తెరవలేదు.. మేము గేట్లు తెరిస్తే మొత్తం భూస్థాపితం అవుతార’’ని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !