న్యూస్‌రీడర్‌గా జర్నీ మొదలుపెట్టి.. యాంకర్‌గా, హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది అనసూయ భరద్వాజ. ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందంటే క్రేజ్ ఎలా మామూలుగా ఉండదు. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అనసూయ ప్రొఫెషనల్‌గా బిజీబిజీగా ఉంది. ఎల్లప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే అనసూయ కాస్త సమయం దొరికితే చాలు అలా ఫ్యామిలీలో రిలాక్స్ అవుతుంది. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి టూర్ వేసింది. ఇంతకీ అనసూయ ఎక్కడికెళ్లిందనుకుంటున్నారా..? సిక్కింలో అందమైన నదీలోయ ప్రాంతానికి వెళ్లింది. బ్లూ క్రాప్ టాప్, డెనిమ్ మిని షార్ట్స్‌లో నదిలోకి దిగి జలకాలాడిరది. భర్త, పిల్లలతో కలిసి నీటిలో తడిసి ముద్దవుతూ.. ప్రకృతి అందాలను ఆస్వాదించింది. సిక్కిం టూర్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ బ్యూటీ సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన పుష్ప ప్రాంఛైజీలో దాక్షాయణి పాత్రలో నటిస్తుందని తెలిసిందే. ఇటీవలే పుష్ప ది రూల్ నుంచి దాక్షాయణి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.