APలో రికార్డు స్థాయిలో పోలింగ్‌...81.86% గా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం !

0

ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి కూడా రికార్డ్‌ స్థాయిలో పోలింగ్‌ నమోదైంది. ఈసారి ఏకంగా 81.86 శాతం పోలింగ్‌ జరిగిదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈవీఎంల ద్వారా పోలింగ్‌ శాతం 80.66గా నమోదు అయిందని తెలిపారు. అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91, అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32 శాతం పోలింగ్‌ నమోదైందని వివరించారు. అత్యధికంగా ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో 87.06 శాతం, అత్యల్పంగా విశాఖ లోక్‌సభ నియోజకవర్గంలో 71.1 పోలింగ్‌ శాతం నమోదైనట్లు చెప్పారు. 2019 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెరిగింది. 

లెక్క తేలింది

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ లెక్క తేలింది. ఎన్నికల సంఘం అధికారికంగా పోలింగ్‌ శాతాన్ని ప్రకటించింది. ఈసారి పోలింగ్‌ శాతం 81.86గా ఈసీ డిక్లేర్‌ చేసింది. ఈ మేరకు ఈసీ అధికారిక ఎక్స్‌ అకౌంట్‌ నుంచి ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో 2014లో 78.90శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2019లో 79.80శాతం పోలింగ్‌ నమోదైంది. అంటే ఈసారి పోలింగ్‌ శాతం పెరిగినట్లు లెక్క.. 2019 ఎన్నికలతో పోలిస్తే 1.5శాతం వరకు పెరిగినట్లు చెప్పారు.ఏపీలో పోలింగ్‌ కొన్ని జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకూ జరిగింది. మంగళవారం రోజు ఏపీ సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా కూడా 81శాతం వరకు పోలింగ్‌ నమోదువుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అందుకు తగినట్లుగానే 81.86శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ కలిపి లెక్క చెప్పిందా.. లేకుండా చెప్పిందా అన్నది పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పోస్టల్‌ బ్యాలెట్‌ లేకుండా అయితే మరో 1శాతం ఓటింగ్‌ పెరిగే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నారు.. వీరిలో 4లక్షల 44వేల 218 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. 2019 ఎన్నికల్లో గమనిస్తే పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా 2,95,003 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంటే 2024 ఎన్నికల్లో అదనంగా 1,49,215 మంది ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓట్లు వేశారని లెక్కలు చెబుతున్నాయి.ప్రాథమికంగా అందిన సమాచారం, అంచనాల ప్రకారం.. 10 జిల్లాల్లో 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైనట్లు చెబుతున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19శాతం, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది. 14 జిల్లాల్లో 75-79.41శాతం మధ్య పోలింగ్‌ నమోదైనట్లు చెబుతున్నారు. ఇక మిగిలిన రెండు జిల్లాల్లోనే 63-66% మధ్య ఓటింగ్‌ ఉందంటున్నారు. ఇదిలా ఉంటే కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలం కురవళ్లిలో ఉన్న 109 పోలింగ్‌ కేంద్రంలో వందశాతం పోలింగ్‌ నమోదుకావడం విశేషం. అయితే రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91శాతం పోలింగ్‌ నమోదైంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !