MegaStar Chiranjeevi : పిఠాపురంలో పవన్‌ని గెలిపించండి ! తమ్ముడి కోసం మెగాస్టార్‌ పిలుపు !

0

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ ను  గెలిపించాలని మెగాస్టార్‌  చిరంజీవి విజ్ఞప్తి చేశారు. పవన్‌కు మద్దతుగా తన ట్విట్టర్లో  వీడియో రిలీజ్‌  చేశారు. తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. ఒకరకంగా చెప్పాలంటే అతడు సినిమాల్లోకి బలవంతంగానే వచ్చినా.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చారని చెప్పారు. ‘అమ్మకడుపులో ఆఖరికి పుట్టినా జనానికి మంచి చేయడంలో ముందుంటాడని చెప్పారు. తన కంటే జనం గురించే ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం  తన తమ్ముడిదని. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తూడవటం, సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందించడం, మత్స్యకారులకు సాయం చేయడం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తోంది. ఏ తల్లికైనా తన కొడుకు బాధపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. ఏ అన్నకైనా తన తమ్ముడు భాదపడుతుంటే బాధేస్తుంది. 

చట్టసభల్లో పవన్‌ గొంతు వినాలి !

అలా బాధ పడుతున్న నా తల్లికి ఒక మాట చెప్పా. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ల బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం ఇది చెప్పాను. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లనే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకితం చేసిన శక్తిశాలి పవన్‌ కల్యాణ్‌. రాష్ట్ర భవిష్యత్తు కోసం శక్తిని వినియోగించాలి అంటే చట్టసభల్లో అతడి గొంతును మనం వినాలి. ‘జనమే జయం’ అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు పవన్‌కల్యాణ్‌ను గెలిపించాలి. మీకు సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు. మీ కోసం కలబడి మీ కలలను నిజం చేస్తాడు. గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి పవన్‌ను గెలిపించండి’’ అని చిరంజీవి కోరారు. ఇక్కడ పోరు రసవత్తరంగా ఉంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌ ప్రచారం చేశారు. ఇవాళ చిరంజీవి తన తమ్ముడికి మద్దతుగా వీడియో రిలీజ్‌ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !