యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూసిన సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. వివిధ మీడియా హౌస్‌లు, సర్వే సంస్థలు ప్రజల అభిప్రాయాలను సేకరించి, వాటన్నింటినీ క్రోడీకరించి దేశంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో అంచనా వేశాయి. ముచ్చటగా మూడోసారి ఎన్డీయే కూటమే అధికారం చేపడుతుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనాలు కట్టాయి. అయితే, ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచార సమయంలో పదేపదే వల్లించిన ‘చార్‌సౌ పార్’ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎన్డీయే కూటమి కనిష్ఠంగా 281, గరిష్ఠంగా 392 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు జన్‌కీ బాత్, ఇండియా న్యూస్-డీ డైనమిక్స్, రిపబ్లిక్ పీమార్క్, రిపబ్లిక్ భారత్ తదితర సర్వే సంస్థలు వెల్లడిరచాయి. మరోవైపు ఎలాగైనా ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో విపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ‘ఇండియా కూటమి’ అంతగా ప్రభావితం చూపే అవకాశాలు కనిపించడం లేదు. దానికి అనుకూలంగా ఇప్పటివరకు ఒక్క సర్వే కూడా వెల్లడి కాలేదు. వివిధ సంస్థల అంచనాల ప్రకారం 118 నుంచి 154 స్థానాల మధ్య ఇండియా కూటమి సాధించే అవకాశం ఉన్నట్లు సర్వే సంస్థలు ప్రకటించాయి.
Lok Sabha exit polls 2024 : మూడోసారి...మోదీయే ! ఎగ్జిట్‌పోల్స్ అంచనా !!
జూన్ 01, 2024
0
Tags