వరదనీటిలో చిక్కుకున్న స్కూల్‌బస్‌ - తప్పిన ప్రమాదం !

0


తెలంగాణలో కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓ ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన బస్సు వరదనీటిలో చిక్కుకుంది. మహబూబ్‌ నగర్‌ మండలం మన్నెకొండ రైల్వే గేట్‌ సమీపంలో సూకూర్‌ గడ్డ తండా మన్నెంకొండ రైల్వే గేట్‌ వద్ద రైల్వే అండర్‌ పాస్‌ లో భాష్యం పాఠశాలకు చెందిన బస్సు చిక్కుకోవడంతో పూర్తిగా బస్సు నీటిలో మునిగిపోయింది. ఘటన జరిగిన సందర్భంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్‌ బస్సు సగం వరకు బస్సు నీటిలో ఉండటంతో అందులోని విద్యార్థులు పెద్దగా కేకల వేశారు. బస్సు నీట మునిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకుని విద్యార్థులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ట్రాక్టర్‌ సాయంతో బస్సును బయటికి లాగారు. పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరిపించుకున్నారు. .బస్సు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఉంటే పూర్తిగా నీటిలో మునిగిపోయేదని.. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !