చియాన్‌ విక్రమ్‌కి గుండెపోటు !

0

తమిళ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌కి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే చెన్నైలోని కావేరి హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులతో పాటు హాస్పిటల్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విక్రమ్‌ ఆరోగ్యంగా తిరిగిరావాలంటూ పోస్టులు పెడుతున్నారు. ఆయన చిత్రాలు తెలుగులోని ఘనవిజయాన్ని సాధించాయి. ప్రస్తుతం ఆయన కోబ్రా, మణిరత్నం దర్శకత్వంలోని పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం టీజర్‌ లాంచ్‌కి విక్రమ్‌ హాజరుకావలసి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !