నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్​న్యూస్

0

తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. ఏళ్లుగా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న యువత కోసం సీఎం కేసీఆర్  కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని కేసీఆర్​ ఆదేశించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, గ్రూప్‌–1 వంటి కేంద్ర, రాష్ట్ర సర్వీసుల ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చేందుకు ‘ఆలిండియా సర్వీసెస్‌ స్టడీ సర్కిల్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌’ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. నాలుగు వర్గాలకు 4 ఆలిండియా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

హైదరాబాద్​లోని ప్రగతిభవన్‌లో బడుగు, బలహీనవర్గాలకు విద్యా, ఉపాధి సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా వర్గాల విద్యార్థినీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యనందించడం, పోటీ పరీక్షలకు శిక్షణనివ్వడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, గురుకుల పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా ఉన్నతీకరించడం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), మైనార్టీ (Minority) స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగం, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !