ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి చెక్‌ పెడుతున్న వైసీపీ అధిష్టానం !

0


ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. తన తమ్ముడికి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగిస్తామని చెప్తోందని తెలిపారు. నాకు పోటీగా, నా తమ్ముడికి ఆఫర్‌ ఇవ్వటమా ? ఒక వేళ తన తమ్ముడు గిరిధర్‌ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను నిలబడబోనని స్పష్టం చేశారు. రాజకీయాలకు గుడ్‌ బై చెప్తానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోన్‌ ట్యాపింగ్‌తో తన మనసు కలత చెందిందన్నారు. కంటి నిండా కునుకు లేకుండా చేస్తోందని వాపోయారు. అనుమానం ఉన్నచోట కొనసాగడం కష్టమన్నారు. గత మూడు నెలలుగా తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోన్‌ కాల్స్‌ను రహస్యంగా వింటున్నారని సన్నిహితుల దగ్గర వాపోయారు. సోమవారం తన నియోజకవర్గంలోని అనుచరులతో మాట్లాడారు. కార్పొరేటర్లతో పాటు కొంతమంది సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మూడు తరాలుగా వైఎస్‌ కుటుంబానికి విధేయుడిగా ఉన్నానంటూ అనుమానం ఉన్నచోట కొనసాగడం కష్టమని వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. రాజకీయాలు తనకు కొత్తేమీ కాదని, ఎత్తుపల్లాలు ఎరిగిన వాడినన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమేనని, మీ నిర్ణయం ఏమిటో చెప్పాలని వారిని కోరినట్లు సమాచారం. ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి తమ్ముడు గిరిధర్‌ రెడ్డి రాష్ట్ర సేవాదల్‌ అధ్యక్షుడిగా ఉన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !