దుబాయి టూర్‌లో విజయ్‌, రష్మిక !

0


తెర మీద అందమైన ప్రేమజంటగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న నిజజీవితంలో ఎక్కడ కనిపించిన వారిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవలే వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్‌కి వెళ్లారంటూ, సీక్రెట్‌ గా ప్రేమాయణం నడుపుతున్నారంటూ సోషల్‌ మీడియాలో, వెబ్‌ సైట్స్‌ లో విపరీతంగా కథనాలు వచ్చాయి. వీటి పై రష్మిక ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కౌంటర్‌ కామెంట్స్‌ చేసింది. విజయ్‌ దేవరకొండ, తను మంచి ఫ్రెండ్స్‌ అని, స్నేహితులు కలిసి టూర్స్‌కి వెళ్ళరా? అయినా మా రిలేషన్‌షిప్‌ గురించి మేము ఎందుకు అబద్ధం చెప్పాలి? అంటూ కౌంటర్‌ ఇచ్చింది.

తాజాగా వీరిద్దరూ కలిసి మళ్ళీ దుబాయ్‌ టూర్‌ కి వెళ్లారు. విజయ్‌ దేవరకొండతో సెల్ఫీ దిగడానికి ఒక అభిమాని ట్రై చేస్తుంటే మధ్యలో రష్మిక కూడా ఆ ఫొటోలో కనిపించేలా పోజ్‌ ఇస్తున్న ఒక ఫోటో బయటకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతుంది. అయితే వీరిద్దరూ దుబాయ్‌కి ఏ పని మీద వెళ్లారు అనేది తెలియాల్సి ఉంది. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !