అత్యంత విషమంగా తారక రత్న ఆరోగ్యం !

0


సినీనటుడు, టీడీపీ నాయకుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బెంగళూరు హృదయాలయ ఆస్పత్రి వైద్యులు వెల్లడిరచారు. ఈ మేరకు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వర్గాలు తాజాగా ఆయన హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశాయి. తారకరత్నకు ప్రత్యేక బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌, ఇతర స్పెషలిస్ట్‌లు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం తారకరత్నకు ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నామని వివరించారు. గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కావడం లేదని, బెలూన్‌ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ట్రీట్‌మెంట్‌ కొనసాగిస్తున్నాం’’ అని ఆస్పత్రి వర్గాలు ప్రకటనలో తెలిపాయి.

ఏం జరిగిందంటే?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిన్న కుప్పం నియోజకవర్గం నుంచి యువగళం పేరిట పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పల్స్‌రేట్‌ను పెంచడానికి దాదాపు 45 నిమిషాలపాటు తీవ్రంగా శ్రమించారు. అనంతరం అతడు కోలుకోవడంతో మిగతా పరీక్షలు నిర్వహించి గుండెనాళాల్లో రక్తం పేరుకుపోయిందని గుర్తించి అందుకు తగ్గవిధంగా వైద్య సహాయం అందించారు. అనంతరం వైద్యులు, కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

విషప్రయోగం జరిగిందా ?

తారక రత్న శరీరం నీలంగా మారింది. ఈ విషయంపై నందమూరి అభిమానులు విష ప్రయోగం ఏమైనా జరిగిందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  పూర్తి ఆరోగ్యంగా ఉన్న తారక రత్న పాదయాత్ర సమయంలో సడెన్‌గా కుప్పకూలటం పట్ల తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !