BCCI చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేస్తూ బీసీసీఐ కార్యదర్శి జైషాకు చేతన్ శర్మ రాజీనామా లేఖను పంపారు. చేతన్ శర్మ రాజీనామాను బీసీసీఐ వెనువెంటనే ఆమోదించింది. ఇటీవల అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే చేతన్ శర్మ రాజీనామాకు కారణం అని తెలుస్తుంది.
ఇటీవల స్టింగ్ ఆపరేషన్‌లో టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకొని ఫిట్ నెస్ పరీక్షలకు హాజరవుతున్నారని కామెంట్స్ చేశారు. చేతన్ శర్మ వ్యాఖ్యలను బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. క్రికెట్ అంతర్గత వ్యవహారాలను బహిరంగ వేదికపైన మాట్లాడడం రూల్స్‌కు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ ఎఫెక్ట్ తో తనపైన వేటు తప్పదనుకున్నారో ఏమో కానీ ఇంతలోనే తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జైషాకు మెయిల్ చేశారు. అయితే ఈ రాజీనామాను జైషా ఆమోదించినట్లు తెలుస్తుంది.