Jee main Results : జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల, సత్తాచాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు !

0

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌-2023 సెషన్‌-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన సింగారపు వెంకట్‌ కౌండిన్య 300/300 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. నగరానికే చెందిన సాయి దుర్గా రెడ్డి ఆరో ర్యాంక్‌ సాధించగా.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు విద్యార్థి పీ.లోహిత్‌ ఆదిత్య సాయి రెండో ర్యాంకు, అమలాపురానికి చెందిన కే.సాయినాథ్‌ శ్రీమంతకు పదో ర్యాంకు వచ్చింది.

విద్యార్థులు తమ ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో https://jeemain.nta.nic.in/లో చూసుకోవచ్చు. తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 జనవరిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 8.24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు జరిగిన సెషన్‌-2 పరీక్షలకు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా (పేపర్‌-1, 2).. 9 లక్షల మంది వరకు పరీక్షకు హాజరైనట్టు సమాచారం.

ఈ నెల 30 నుంచి అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్లు..

జేఈఈ మెయిన్‌లో కనీస కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ఈ నెల 30 తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 29 నుంచి జూన్‌ 4 వరకు అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూన్‌ 4న పరీక్ష జరుగనుంది.జూన్‌ 18వ తేదీన వెల్లడిస్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !