Shalini Celebrate Her Divorce : విడాకులు వైఫల్యం కాదు, అదోక మలుపు !

0

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మరపురాని వేడుక. కాబోయే జీవిత భాగస్వామిపై ఎన్నో ఆశలు పెట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత భాగస్వామితో అభిప్రాయ భేదాలతోపాటు, వివిధ సమస్యలు తలెత్తడంతో కొందరు విడాకుల వైపు అడుగులేస్తుంటారు. అలా విడాకులు తీసుకున్న వారు సమాజంలో తిరిగేందుకు కాస్త భయపడుతుంటారు. ముఖ్యంగా మహిళలు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కొంతమంది ఇంటి నుంచి బయటకు రావటానికి సంకోచిస్తుంటారు. కానీ ఓ మహిళ ఏం చేసిందో తెలుసా..

షాలిని ఒక ష్యాషన్‌ డిజైనర్‌. తమిళ బుల్లితెర నటి, ఫ్యాషన్‌ డిజైనర్‌ షాలిని ఒకరు. ‘ముల్లుం మలరుం’ అనే సీరియల్‌లో నటించి ఆమె మంచి పాపులర్‌ అయ్యారు. కొన్ని కారణాల వల్ల ఇటీవల తన భర్తతో విడిపోయారు. విడాకులు మంజూరు కావడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కేక్‌ కట్‌చేసి మరీ పండుగ చేసుకున్నారు. అంతటితో ఆగలేదు ఈ మధ్య కొత్తగా వెలిసిన ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌లా.. ఈ విడాకులకు సంబంధించి కూడా ఆమె ప్రత్యేక ఫొటో షూట్‌ నిర్వహించారు. ఎర్రటి దుస్తులను ధరించి, చేతిలో విడాకులు అనే అక్షరాలను పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారామె. తన భర్తతో కలిసి ఉన్న ఫోటోను చింపేశారు. అలాగే ‘నాకు 99 సమస్యలు ఉన్నాయి. కానీ భర్త ఒక్కటి కాదు’ అని రాసున్న బోర్డును పట్టుకుని ఫొటోలు దిగారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫొటోలను షేర్‌ చేస్తూ.. విడాకులపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

విడాకులు తీసుకున్న మహిళలు గట్టిగా మాట్లాడలేరని భావించే వారికి ఇదో సందేశం. ఇష్టం లేని భాగస్వామి నుంచి విడిపోవటం సరైనదే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండటానికి అర్హులు. మీ జీవితాలను మీ చేతుల్లోకి తీసుకోండి. మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వండి. విడాకులు తీసుకోవటం వైఫల్యం కాదు. జీవితానికి ఇదొక మలుపు. ఇది సానుకూల మార్పులకు దారి తీస్తుంది. ఒంటరిగా ఉండాలంటే ఎంతో ధైర్యం కావాలి. కాబట్టి ఒంటరిగా ఉండే మహిళలందరికి  దీన్ని అంకితం చేస్తున్నాను’ అని రాసుకొచ్చారు.  ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన కొందరు నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !