Cm Ys Jagan Speech in pattikonda public meeting : రైతులు బాగుపడాలనే పెట్టుబడి సాయం !

0

రైతులు బాగుంటేనే రాష్ట్రంబాగుటుందని నమ్మాను. అందుకే రైతన్నకు మంచి జరగాలనే తాపత్రయంతో ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో రైతుల ఖాతాల్లోకి వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం నిధుల జమ కార్యక్రమ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మీ ప్రేమానురాగాలకు రెండు చేతులూ జోడిరచి నమస్కరిస్తున్నా. ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ అభివాదం చేసి మరీ తన ప్రసంగం ప్రారంభించారాయన. ఇవాళ ఆ రైతన్నల కోసం భరోసా ఇస్తూ.. బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాలోనే  సాయం జమ చేస్తున్నాం. రైతులు ఇబ్బంది పడకూడదనే ఈ పెట్టుబడి సాయం అని అన్నారాయన. 

రైతులకు అండగా

రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. ఐదో ఏడాది.. తొలి విడుత నిధుల్ని ఇప్పుడు విడుదల చేస్తున్నాం. 52,30,939 మంది రైతన్నల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తున్నాం. గత ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది. కానీ, మేం మొదటి నుంచి రైతులకు అండగా ఉంటూ వస్తున్నాం. ప్రతీ రైతన్నకు రూ.61,500 సాయం(ఇవాళ జమ చేసేదాంతో కలిపి) అందించాం. గత నాలుగేళ్లుగా 22.70 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు.. రూ.1,965 కోట్లు నేరుగా వాళ్ల ఖాతాల్లో జమ చేశాం.

రైతు భరోసా ప్రభుత్వం

మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కువగా రూ.12,500కి బదులు.. రూ. 13,500 రైతు భరోసా అందిస్తున్నాం.  ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 31 వేల కోట్లు జమ చేశాం. ప్రతీ ఏడాది రూ. 3,923 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తున్నాం. ఏ సీజన్‌లో అయిన పంట నష్ట జరిగితే.. అదే సీజన్‌లో నష్ట పరిహారం అందిస్తున్నాం. ఇన్‌పుట్‌ సబ్సిడీ చరిత్రలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. విత్తనం నుంచి పంట కొనుగోలుదాకా రైతన్నలకు అండగా ఉన్నాం. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం.  మీ ఈ బిడ్డ పరిపాలన మొదలయ్యాక.. మంచి వానలు ఉన్నాయి. కరువుల్లేవ్‌.. వలసలు కూడా తగ్గిపోయాయి. ఈ నాలుగేళ్లలో ఒక్క కరువు మండలం లేదని సీఎం జగన్‌ పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం రాష్ట్రంలో కరువు రాజ్యం ఏలిందన్నారు, వర్షాలు పడక, పంటలు పండక నానా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పేదలను, రైతులను పట్టించుకోలేదని విమర్శించారు ఏపీ సీఎం జగన్‌.  మహానాడు పెద్ద డ్రామా అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసిన ఆయన .. వైసీపీ ప్రభుత్వం పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !