Happy Birthday Super Star Maheshbabu : మాస్‌ సెగలు రేపుతున్న గుంటూరు కారం !

0

 

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ రూపొందిస్తున్న చిత్రమిది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుండటంతో ఇటీవల ఆ అంచనాలు మరింత పెరిగాయి. హారికా అండ్‌ హాసిని ఎంటర్టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చివరికి సినిమా ఉంటుందా? లేదా? అనే చర్చ కూడా జరిగింది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఖుషి చేసే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది యూనిట్‌. నేడు ఆగస్ట్‌ 9న మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా గుంటూరు కారం చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో ఓ ఆఫీస్‌లో టేబుల్‌పై కూర్చొని సిగరేట్‌ వెలిగించుకుంటున్నట్టుగా ఉన్న మహేష్‌ కొత్త లుక్‌ అదిరిపోయింది. ఊర మాస్‌గా ఉంది. ఇందులో మహేష్‌ లుంగీ కట్టుకుని ఉన్నాడు. ఇంత మాస్‌ లుక్‌లోనూ మహేష్‌ స్టయిలీష్‌ గ్లాసెస్‌ పెట్టుకోవడం విశేషం.

రూమర్స్‌ చెక్‌ పెట్టేలా !

ఇది మాస్‌ మొగుడిలా ఉందని అంటున్నారు ఫ్యాన్స్‌. వాళ్లు ఈ కొత్త లుక్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ బర్త్‌ డేకి ఇది చాలు అనేలా ఈ కొత్త పోస్టర్‌ ఉండటం విశేషం. ఇందులో అనేక రూమర్స్‌ కి చెక్‌ పెట్టే ప్రయత్నం చేసింది యూనిట్‌. రిలీజ్‌ డేట్‌ని మరోసారి కన్ఫమ్‌ చేసింది. జనవరి 12న రాబోతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. షూటింగ్‌ సరిగా జరగని నేపథ్యంలో విడుదల తేదీ వాయిదా పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ విషయంపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. ఇక సంగీత దర్శకుడు తమన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకొంటున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటికి కూడా పోస్టర్‌తో సమాధానం ఇచ్చింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఆయనే కొనసాగనున్నారు.  ఇంత వరకూ బాగానే ఉన్నా, మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా కేవలం పోస్టర్‌ మాత్రమే విడుదల చేయడం పట్ల అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. సినిమా నుంచి ఏదైనా లిరికల్‌సాంగ్‌, లేదా గ్లింప్స్‌లాంటిది ఇచ్చి ఉంటే వారి ఆనందం మరో రేంజ్‌లో ఉండేది. కనీసం డైలాగ్‌ టీజర్‌నైనా విడుదల చేస్తే బాగుండేదని సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే నిజానికి మహేష్‌ బర్త్‌ డేకి ముందుగా ఓ సాంగ్‌ని విడుదల చేయాలని భావించారు. థమన్‌ ఓ ట్యూన్‌ కూడా రెడీ చేశారు. ప్రోమోలతో సహా అన్నీ సిద్ధం చేశారు. మహేష్‌ బాబుకి ఈ ట్యూన్‌ని పంపించగా, ట్యూన్‌ నచ్చలేదని, కొత్త ట్యూన్‌ చేయమని చెప్పాడట. ఇప్పటికిప్పుడు తన వల్ల కాదని, మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ లైట్‌ తీసుకున్నారట. దీంతో చేసేదేం లేక సాంగ్‌ రిలీజ్‌ ఆలోచన విరమించుకుని జస్ట్‌ పోస్టర్‌తో సరిపెట్టుకున్నారు. 

మహేష్‌ సినిమాపై దృష్టిపెట్టని త్రివిక్రమ్‌ !

ఈ సినిమా విషయంలో మొదట్నుంచి త్రివిక్రమ్‌ వర్క్‌ పై, ఆయన టెక్నీషియన్ల వర్క్‌ పై మహేష్‌ అసహనంతో ఉన్నారట. ఔట్‌పుట్‌ సరిగా రావడం లేదని ఆయన అసంతృప్తి చెందుతున్నారని వార్తలొస్తున్నాయి. మొదట్లో ఫైట్‌ సీక్వెన్స్‌ చేయగా, అవి నచ్చలేదన్నారట మహేష్‌. దీంతో వాటిని పక్కన పెట్టి టాక్‌ పార్ట్‌ షూట్‌ చేయాలని భావించారు త్రివిక్రమ్‌. కానీ చాలా మంది పెద్ద ఆర్టిస్టులుండటంతో వారి డేట్స్‌ సెట్‌ కాక షూటింగ్‌ డిలే అవుతూ వస్తోంది. చివరికి ఇటీవల కొంత టాకీ పార్ట్‌ ని పూర్తి చేసినట్టు సమాచారం. అయినా త్రివిక్రమ్‌ విషయంలో మహేష్‌ గుర్రుగా ఉన్నారని, ఇద్దరికి పడటం లేదని సమాచారం. ముఖ్యంగా త్రివిక్రమ్‌ ఇతర ప్రాజెక్ట్‌ లకు పనిచేస్తూ, తమ సినిమాపై ఫోకస్‌ పెట్టడం లేదని మహేష్‌ వైపు నుంచి ఆరోపణగా వినిపిస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా అనే విషయంలోనూ మహేష్‌ అభ్యంతరం తెలిపారట. దీంతో ఆమెని పక్కన పెట్టారు. సెకండ్‌ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీలని మెయిన్‌ ఫీమేల్‌ లీడ్‌గా చేశారని, సెకండ్‌ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని తీసుకుంటున్నారని సమాచారం. ఇటీవల ఓ షెడ్యూల్‌ పూర్తయ్యింది. దీంతో వెంటనే మహేష్‌ ఫ్యామిలీతో కలిసి లండన్‌ టూర్‌ వెళ్లారు. అక్కడ కొన్ని పర్సనల్‌ వర్క్‌ కూడా కంప్లీట్‌ చేసుకునే పనిలో పడ్డారు. కుమారుడు గౌతమ్‌ని లండన్‌లో చదివించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆయన వచ్చాక మరో షెడ్యూల్‌ ప్రారంభమయ్యే ఛాన్స్‌ ఉంది. అయితే ఆయన లేని సన్నివేశాలు ముందుగా తీసేందుకు త్రివిక్రమ్‌ సిద్ధమవుతున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !