Rk Roja : బ్రాహ్మణికి రోజా స్ట్రాంగ్‌ కౌంటర్‌ !

0
నారా బ్రాహ్మణిపై మంత్రి ఆర్కే రోజా కౌంటర్‌ ఎటాక్‌ దిగారు. బ్రాహ్మణి తెలియక మాట్లాడుతున్నారా? తెలిసే అబద్ధాలు చెబుతున్నారా? అంటూ మంత్రి రోజా మండిపడ్డారు. ఇవాళ ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు వంటి పేద ప్రజల కోసం.. వారి సంక్షేమం కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆలోచించారా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు.

ఇంకోసారి మాట్లాడితే మర్యాద దక్కదు

స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాంలో చంద్రబాబు నాయుడు దొరికిపోయి జైల్లో కూర్చున్నారని వ్యాఖ్యానించారు. ఆయనకు మద్దతుగా నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని.. గంట కొట్టండి, విజిల్స్‌ వేసి జగన్‌కు బుద్ధి చెప్పండని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణితో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ ప్రజల సొమ్ము తిన్నారని చెప్పారు. రాష్ట్రంలో పెద్ద సైకోలు ఎవరంటే.. అది మీ నాన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మీ మామ నారా చంద్రబాబు నాయుడు మాత్రమే అంటూ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి గురించి ఇంకోసారి గానీ మాట్లాడితే మర్యాద దక్కదు అంటూ బ్రాహ్మణికి మంత్రి వార్నింగ్‌ ఇచ్చారు. ఇన్ని రోజులు నువ్వు రాజకీయం గురించి మాట్లాడా లేదు కాబట్టి నేను మాట్లాడలేదు.. ఇప్పుడు ఇలా అసత్యపు ట్విట్లు చేయడం ఎంత వరకు న్యాయం అని ఆమె ప్రశ్నించారు.హైదరాబాద్‌ కే పరిమితమైన కుటుంబాన్ని ప్రజలు మళ్లీ ఏపీలోకి రాకుండా చేస్తారని బ్రాహ్మణిపై రోజా విమర్శలు గుప్పించారు.

రోజా గురించి జుగుప్సాకరంగా మాట్లాడారు..

టీడీపీ నేత బండారు సత్యనారాయణను అరెస్టు చేయాలంటూ ఏపీ డీజీపీకి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. మంత్రి రోజా గురించి ఆయన జుగుప్సాకరంగా మాట్లాడారని చెప్పారు. సభ్య సమాజం తలదించుకునే కామెంట్స్‌ చేశారని అన్నారు. ప్రెస్‌ మీట్లు పెట్టి బండబూతులు మాట్లాడుతున్నారని, దీన్ని ఉపేక్షించరాదని చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !