Amaravati Ring Road Case : లోకేష్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం ?

0

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఢల్లీి నుండి రాజమండ్రి లేదా విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లోనే అదుపులోకి తీసుకోబోతున్నారా..? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా సోషల్‌ మీడియా లోను ఇదే చర్చ నడుస్తుంది. గత కొన్ని రోజులుగా స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబును ఎలా అరెస్ట్‌ చేసారో తెలియంది కాదు..నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు వద్దకు పెద్ద ఎత్తున పోలీస్‌ బలగాలతో వెళ్లి..నానా హడావిడి మధ్య అదుపులోకి తీసుకున్నారు. తన తప్పు ఏమిలేదని..అసలు ఎఫ్‌ఐఆర్‌లో తన పేరే లేదని ..ఎలా అరెస్ట్‌ చేస్తారని ప్రశించినప్పటికీ.. సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తూనే ఉన్నాం.

అరెస్ట్‌ చేస్తే పార్టీని నడిపేది ఎవరు ?

ఇక ఇప్పుడు అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో నారా లోకేష్‌ చుట్టు  సీఐడీ అధికారులు ఉచ్చు బిగిస్తున్నారు. ఈ కేసులో లోకేష్‌ ను ఏ14 గా చేరుస్తూ హైకోర్టులో ఏపీ సీఐడీ మంగళవారం మెమో దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో లోకేష్‌ను ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. లోకేష్‌ ను అరెస్ట్‌ చేస్తే ఏంచేయాలి..అనే ఆలోచనలో టీడీపీ శ్రేణులు ఉన్నారు. ప్రస్తుతం లోకేష్‌ ఢల్లీిలో ఉన్నారు. చంద్రబాబు కేసుల విషయమై న్యాయవాదులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఆయన చేపట్టిన యువగళం పాదయాత్రకు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. ఈ యాత్రను 29 వ తేదీ నుండి తిరిగి ప్రారంభించాలని లోకేష్‌ భావిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలతో ఇటీవల నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన వెల్లడిరచారు. ఈ నేపథ్యంలో యాత్ర ప్రారంభానికి ముందే లోకేష్‌ అరెస్ట్‌ చేస్తారని కొంతమంది అంటుంటే..ఏ క్షణమైనా అరెస్ట్‌ చేయొచ్చని మరికొంతమంది అంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.

టీడీపీ-జనసేన నేతలతో కలిసి జేఏసీ ఏర్పాటు !

అధినాయకుడు జైల్లో ఉండడంతో టీడీపీ పార్టీ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసుకుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమైంది. జనసేన నేతలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 29 నుంచి లోకేష్‌ పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని కమిటీ పేర్కొంది. స్కిల్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉండడంతో రాజకీయ కార్యాచరణను సమన్వయం చేసి పార్టీని ముందుకు నడిపించేందుకు టీడీపీ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీని ఏర్పాటుచేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమైంది. పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం 14 మందితో ఈ కమిటీ ఏర్పాటయింది. సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, ఇతర సభ్యులు హాజరయ్యారు. నారా లోకేష్‌..ఢల్లీి నుంచి జూమ్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగిశాక అచ్చెన్నాయడు మీడియాతో మాట్లాడారు. ఏపీ సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్ర స్థాయిలో పోరాడేందుకు టీడీపీ-జనసేన నేతలతో కలిసి జేఏసీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జేఏసీ ఏర్పాటు చేస్తామని, దీనిపై జనసేనతో కో-ఆర్డినేట్‌ చేసుకుంటామన్నారు అచ్చెన్ననాయుడు. 

ఇన్నర్‌ రింగ్‌రోడ్డే లేదు, భూసేకరణ లేదు...స్కామ్‌ ఎలా ? 

ఈ నెల 29న రాత్రి 8:15కి లోకేష్‌ యువగళం పాదయాత్ర తిరిగి కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. పాదయాత్ర ఎక్కడ ఆగిందో.. అక్కడ నుంచే తిరిగి ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. అక్రమ కేసులతో చంద్రబాబును అరెస్ట్‌ చేసినా ప్రభుత్వం వైపు నుంచి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు అచ్చెన్నాయుడు. ప్రభుత్వ విధానాలపై ప్రజాక్షేత్రంలో పోరాడతామన్నారు. లోకేష్‌కు సంబంధం లేని విషయంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసు అంటూ కేసు నమోదు చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ లేదని.. భూ సేకరణ కూడా జరగలేదన్నారు. కానీ ఏదో జరిగిందనే భ్రమలు కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు అచ్చెన్న. మీరేం తప్పు చేశారు.. ఏం ఆధారాలున్నాయో చెప్పండంటూ కేసులు పెట్టిన వారే చంద్రబాబును అడుగుతున్నారన్నారు టీడీపీ నేత. తమపై కేసులు పెట్టి, ఓటర్ల జాబితాలో వైసీపీ అవకతవకలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అన్ని స్థాయిల్లో ఓటర్‌ జాబితా వెరిఫికేషన్‌ చేపడతామన్నారు టీడీపీ నేతలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !