దిల్లీలోనే ఉన్న నారా లోకేష్‌కు కేంద్రప్రభుత్వంలోని కీలక నాయకులను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని బెడిసికొడుతున్నాయి. బీజేపీ అగ్రనేత కేంద్ర హొంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం లోకేష్ చేయని ప్రయత్నం లేదు. నడ్డాతో పాటు ఇతర నాయకులను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అవుతున్నాయి. ఎంత పెద్ద తలకాయలతో లాబియింగ్ చేసిన టిడిపి నేత నారా లోకేష్ పేరు చెబితేనే బిజెపి అగ్రనేతలు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అపాయింట్‌మెంట్ లభించటం ఒక్కటే ఊరట. ఒక్కసారి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇస్తే చాలు అని కళ్ళు కాయలు కాచేలా ఓపికతో వేచి చూస్తున్నారు. ఎలాగైనా సరే తన తండ్రిని కాపాడుకోవాలని లోకేష్ కృతనిశ్చయంతో ఉన్నారు.
అరెస్ట్ భయంతో దిల్లీలోనే !
ఇక లోకేష్ దిల్లీలో ఉండడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు జైల్లో ఉన్నారు. అదే కేసులో నారా లోకేష్ కూడా నిందితుడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. షెల్ కంపెనీల ద్వారా పంపిన కోట్లాది రూపాయల లూటీ సొమ్ములో కొంత భాగం హవాలా ద్వారా లోకేష్ సన్నిహితుడైన కిలారు రాజేష్ ద్వారా తిరిగి లోకేష్‌కు అందాయని కీలక ఆధారాలను కూడా సేకరించింది ఈడీ. చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారిస్తోన్న సిఐడీ పోలీసులు చంద్రబాబు నుండి సేకరించే ఆధారాలతో పాటు ఈడీ ఇంతకు ముందే తమకు అప్పగించిన ఆధారాలతో సీఐడీ లోకేష్‌ను కూడా విచారించే అవకాశాలున్నాయని అందుకే లోకేష్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి.