Bandi Sanjay: తెలంగాణ సాధించుకుంది కేసీఆర్‌ కుటుంబం కోసమా ?

0

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ వ్యతిరేకిగా చూపేందుకు, తెలంగాణ సెంటిమెంట్‌ను తిరిగి రెచ్చగొట్టేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. మోదీని చూస్తే కేసీఆర్‌ కుటుంబం గజగజ వణుకుతోందంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణపై మోదీ విషం చిమ్ముతున్నారని కేటీఆర్‌ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఈ సందర్భంగా బండి సంజయ్‌ మండిపడ్డారు. ఈ మేరకు బండి సంజయ్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. నిన్న ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా విషం చిమ్మడమేనా అని ప్రశ్నించారు. అభివృద్ధి వ్యతిరేక పార్టీ బీఆర్‌ఎస్‌ అంటూ బండి సంజయ్‌ ఆరోపించారు. 

ప్రగతి భవన్‌లో అలజడి

ప్రధాని నరేంద్ర మోదీని టూరిస్టు అని  కేటీఆర్‌ విమర్శించడాన్ని సంజయ్‌ తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది కుటుంబం కోసమేనా అంటూ నిలదీశారు. కేసీఆర్‌ నిజస్వరూపాన్ని ప్రధాని మోదీ బట్టబయలు చేయడంతో ఇప్పుడు ప్రగతి భవన్‌లో అలజడి మొదలైందంటూ సంజయ్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌లో చీలిక తప్పదని, నిట్టనిలువున పార్టీ చీలుతుందని బండి సంజయ్‌ జోస్యం చెప్పారు. కేసీఆర్‌ 15 రోజులుగా కనపడటం లేదు..మాకు అనుమానం కలుగుతోంది..కేసీఆర్‌ ను కేటీఆర్‌ ఏమైనా చేశారా..? అంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ బాగుండాలి..సీఎం కేసీఆర్‌ ను మేమంతా చూడాలి అంటూ సెటైరిక్‌ గా వ్యాఖ్యానించారు. మోదీ కామెంట్స్‌ పై కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టాలి అంటూ సూచించారు. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ కు ముందే రాజకీయం ఇలా ఉందంటే.. మున్ముందు మరింత హీటు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నిప్పులు చెరిగిన రేవంత్‌రెడ్డి !

తెలంగాణలో బీజేపీని నడిపిస్తుంది బీఆర్‌ఎస్‌ అని టీపీసీసీ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటునే అపహాస్యం చేసిన మోడీ.. తన మిత్రుడు కేసీఆర్‌ తో జరిగిన చర్చలు బయట పెట్టారని అన్నారు. ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ లో కవిత ను అరెస్ట్‌ చేయొద్దు అని కూడా చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు. కిషన్‌ రెడ్డి నియామకం కూడా కేసీఆర్‌ కోరిక మేరకు అనేది చెప్తే కూడా బాగుండేదని అన్నారు. తెలంగాణ లో బీజేపీని నదిపిస్తుంది బీఆర్‌ఎస్‌ అన్నారు. అన్ని కోరికలు నెరవేర్చలేదు కొన్ని కోరికలు నెరవేర్చినట్టు మోడీ చెప్పారని, అవినీతి పరుల భరతం పడతా అనే మోడీ..కేసీఆర్‌ మీద ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. అవినీతి చేశారు అని చెప్పిన మోడీ.. కేసీఆర్‌ మీద విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని అన్నారు. బీజేపీకి కేసీఆర్‌ ప్రొటెక్షన్‌ మని అందిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మోడీ భాగస్వామిగా ఉన్న కేసీఆర్‌ కి ఇంకా మద్దతు కొనసాగిస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ తో పొత్తు నుండి వైదొలుగుతుందా లేదా? ఎంఐఎం సమాధానం చెప్పాలి? అని ప్రశ్నించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !