Biggboss fame Shanmukh: గంజాయి సేవిస్తూ అడ్డంగా బుక్కైనా షణ్ముఖ్‌ !

0

బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్‌ షణ్ముక్‌ జశ్వంత్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ కేసులో విచారణ కోసం వెళితే గంజాయితో యూట్యూబర్‌ షణ్ముక్‌ పట్టుబడ్డాడు. డ్రగ్‌ కేసులో షణ్ముఖ్‌ ను, అమ్మాయిని మోసం చేసిన కేసులో ఆయన సోదరుడు సంపత్‌ వినయ్‌ ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... బిగ్‌ బాస్‌ రన్నర్‌, యూట్యూబర్‌ షణ్ముక్‌ జశ్వంత్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 5లో రన్నరప్‌ గా నిలిచాడు షణ్ముఖ్‌ జస్వంత్‌. మౌనిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... అతడిని ప్రశ్నించేందుకు షణ్ముఖ్‌ నివసిస్తున్న ఫ్లాట్‌ కు వెళ్లారు. పోలీసులు అక్కడ తనిఖీలు జరుపగా... అక్కడ షణ్ముఖ్‌ గంజాయితో అడ్డంగా బుక్కయ్యాడు. మౌనిక వీడియో తీస్తుండగా డ్రగ్స్‌ మత్తులో ఉన్న షణ్ముఖ్‌ వీడియో తీయోద్దంటూ రచ్చ చేశాడు. షణ్ముఖ్‌, సంపత్‌ లను పోలీసులు అరెస్టు చేసి వారిపై కేసులు నమోదు చేశారు. డ్రగ్స్‌ కేసులో షణ్ముఖ్‌ అరెస్ట్‌ అవ్వగా.. అమ్మాయిని మోసం చేసిన కేసులో సంపత్‌ విజయ్‌ను అరెస్ట్‌ చేసారు. డాక్టర్‌ మౌనిక అనే యువతిని మోసం చేసి.. మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ పై బాధితురాలు కేసు నమోదు చేసింది. తాజాగా పోలీసులకు బాధిత యువతి డాక్టర్‌ మౌనిక తన వాంగ్మూలం ఇచ్చింది. ఆ యువతితో వినయ్‌కు మూడేళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆమెకు ఒకసారి అబార్షన్‌ కూడా చేయించినట్లు సమాచారం. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పి నయవంచనకు గురి చేశాడని యువతి పేర్కొంది. దీనికి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని బాధిత యువతి వెల్లడిరచింది. పోలీసులతో కలిసి వినయ్‌ ఫ్లాట్‌కు వెళ్లగా.. షణ్ముక్‌ వద్ద డ్రగ్స్‌, గంజాయి దొరికాయని తెలిపింది. వారితో తనకు ప్రాణహాని ఉందని.. న్యాయం కావాలని యువతి పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

యువతి వాంగ్మూలంలో సంచలన విషయాలు.. 

యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ‘సంపత్‌ను యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ పరిచయం చేశాడు. మా పరిచయం ప్రేమగా మారాక సంపత్‌ వినయ్‌ పలుమార్లు నాపై లైంగిక దాడి చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకోవాలని నన్ను బలవంత పెట్టగా.. చేతికి రింగ్‌ పెట్టి మనం పెళ్లి చేసుకోబోతున్నామని నమ్మించాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. ఒకసారి గర్భం కూడా తీయించాడు. ఈ విషయం సంపత్‌ పేరెంట్స్‌ అప్పారావుకి చెప్పా. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే.. మీ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలకు సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించారు. సంపత్‌కి మరో యువతి తో పెళ్లి అయ్యిందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశా.’అని తెలిపింది. పోలీసులతో కలిసి నానక్‌రామ్‌గూడలోని సంపత్‌ ఫ్లాట్‌కి వెళ్లాను. అక్కడే షణ్ముక్‌ ఉన్నాడు. అతని వద్ద గంజాయి.. డ్రగ్స్‌ పిల్స్‌ ఉన్నాయి. జావేద్‌ అనే కానిస్టేబుల్‌ షణ్ముక్‌కు సహకరించే ప్రయత్నం చేశాడు. మమ్మల్ని వెంటనే కిందకు వెళ్లమని బలవంతపెట్టాడు. నన్ను కాంప్రమైజ్‌ అవమని కానిస్టేబుల్‌ ఒత్తిడి తెచ్చాడు. నా దగ్గర విడియో కూడా ఉందని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

మొదటిసారి కాదు

షణ్ముఖ్‌ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు.... గతంలో హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అరెస్టు అయ్యాడు కూడా. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి రిలీజ్‌ అయ్యాడు. యూట్యూబ్‌ వీడియోలతో సెలబ్రిటీగా మారిన షణ్ముఖ్‌... సాఫ్ట్‌ వేర్‌ డెవలపర్‌, సూర్య వెబ్‌ సిరిసులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపు అతడ్ని బిగ్‌ బాస్‌ 5లోకి ఎంటర్‌ అయి.. సీజన్‌ రన్నర్‌ అయ్యాడు. ఇక ఆ సీజన్‌ విన్నర్‌ కావాల్సిన షణ్ముఖ్‌ చివరగా రన్నర్‌ గా నిలిచాడు. సిరి హనుమంత్‌ తో కలిసి హద్దులు మీరడంతో విన్నర్‌ కావాల్సిన జశ్వంత్‌ రన్నర్‌ అయ్యేనే వాదనలు వినిపించాయి. ఇక వీజే సన్నీ విజేతగా నిలిచాడు. ఇక బిగ్‌ బాస్‌ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల అతడి ప్రేమ కూడా బ్రేకప్‌ అయింది. సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌ దీప్తి సునైనా షణ్ముఖ్‌ బ్రేకప్‌ చెప్పేసి బయటకు వచ్చేసింది. ఇక షణ్ముఖ్‌ ప్రముఖ కమెడియన్‌ వైవా హర్ష చిత్రం సుందరం మాష్టార్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో ఇటీవల సందడి చేశాడు. ఇంతలోనే ఊహించని విధంగా పోలీసులకు దొరికిపోయాడు షణ్ముక్‌. ప్రస్తుతం షన్ను, అతడి సోదరుడు పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. గంజాయి కేసు కావడం, అమ్మాయి విషయం కావడంతో కేసు స్ట్రాంగ్‌ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్‌... ఏంట్రా ఇది అంటూ ట్రోలింగ్‌ చేస్తున్నారు. షణ్ముక్‌ ఇలా చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !