Trisha : న్యాయపోరాటానికి దిగిన త్రిష...వెంటాడుతున్న కాంట్రవర్సీలు !

0

  • త్రిషపై పొలిటికల్‌ లీడర్‌ అనుచిత వ్యాఖ్యలు
  • పరువునష్టం దావా వేసిన హీరోయిన్‌ త్రిష
  • పరువు నష్టం కేసులో భారీ మొత్తంలో నష్టపరిహారం 

త్రిష తాజాగా మరోసారి వార్తల్లో ట్రెండ్‌ అయింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐఏడీఎంకే మాజీ నాయకుడు ఏవీ రాజుపై త్రిష న్యాయపోరాటానికి దిగారు. ఈ మేరకు పరువునష్టం దావా వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌ వేదికగా సదరు వివరాలను పంచుకున్నారు. ఇటీవల మీడియా సమావేశంలో ఏవీ రాజు మాట్లాడుతూ.. త్రిషను ఉద్దేశించిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వార్తలు, వీడియోలు సోషల్‌ మీడియాలో దుమారాన్ని రేపాయి. అయితే త్రిష కోసం సెలెబ్రిటీలంతా ముందుకు కదిలారు. ఆ రాజకీయ నాయకుడి వ్యాఖ్యల్ని ఖండిరచారు. అతడ్ని వదిలేది లేదని త్రిష శపథం చేసిన సంగతి తెలిసిందే. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని త్రిష తెలిపింది. చెప్పినట్టుగానే ఇప్పుడు అతడిపై పరువు నష్టం దావా కేసును వేసింది. ఈ క్రమంలో త్రిష స్పందిస్తూ అటెన్షన్‌ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇకపై తాను ఇచ్చే సమాధానం లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచే వస్తుందని హెచ్చరించారు. అన్నట్లుగానే భారీ మొత్తం నష్టపరిహారంగా చెల్లించాలంటూ లీగల్‌ నోటీసులు పంపారు. ఎమ్మెల్యే జి.వెంకటాచలాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన రాజు.. త్రిష వ్యక్తిగత జీవితంపైనా కామెంట్‌ చేశారు.

పరువునష్టం దావా వేసిన త్రిష !

త్రిష చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ తిరుగుతూనే ఉంటుంది. మన్సూర్‌ అలీ ఖాన్‌ వివాదం సద్దుమణిగిందని అనుకుంటున్న ఈ టైంలోనే మరో కాంట్రవర్సీ తెరపైకి వచ్చింది. అన్నా డీఎంకేకి చెందిన ఏవీ రాజు అనే నాయకుడు త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై త్రిష మండిపడిరది. ఇక త్రిషకు మద్దుతగా కోలీవుడ్‌ కదిలింది. సోషల్‌ మీడియా సైతం త్రిషకు అండగా నిలిచింది. ఈ మేరకు త్రిష ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది.సదరు వ్యక్తి త్రిషకు క్షమాపణలు చెప్పాడు. కానీ త్రిష మాత్రం అంతటితో ఊరుకోలేదు. తాను వాగిన వాగుడికి సరైన మూల్యం చెల్లించాల్సిందే అన్నట్టుగా ఫిక్స్‌ అయింది. అందుకే ఏవీ రాజుకి త్రిష లీగల్‌ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆ నోటీసుల్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. తన తరుపు న్యాయవాదులు వేసిన నోటీసుల్ని ఇలా పబ్లిక్‌గా షేర్‌ చేసింది.ఇక ఈ నోటీసుల్లో ఆధారాలుగా కొన్ని యూట్యూబ్‌ చానెళ్ల లింక్స్‌, వెబ్‌ సైట్ల లింక్స్‌ను కూడా యాడ్‌ చేశారు. ఎన్ని కోట్ల మేర పరువు నష్టం దావా వేశారన్న విషయాన్ని మాత్రం దాచి పెట్టేసింది త్రిష. ఇక త్రిష ఇలా చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సరైన పని చేశావ్‌.. ఇలాంటి వాళ్లని ఊరికే వదిలి పెట్టకూడదు అంటూ త్రిషకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక కోలీవుడ్‌ సెలెబ్రిటీల్లో విశాల్‌ ఈ ఘటనను తీవ్ర స్థాయిలో ఖండిరచిన సంగతి తెలిసిందే. కుష్బూ వంటి వారు కూడా త్రిషకు అండగా నిలిచారు.త్రిష ప్రస్తుతం తెలుగులో నటిస్తోంది. చిరంజీవి విశ్వంభర సినిమాలో త్రిష జాయిన్‌ అయిన సంగతి తెలిసిందే. స్టాలిన్‌ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ జోడి కలిసి నటిస్తున్నారు. పద్మభూషణ్‌ వచ్చాక తొలి సారి త్రిషతోనే నటించాడు చిరంజీవి. ఇక ఇప్పుడు పద్మ విభూషణ్‌ వచ్చాక మళ్లీ త్రిషతోనే నటిస్తున్నాడు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !