Drugs Gangs : ఫుడ్‌ డెలివరీ ముసుగులో గాంజా, డ్రగ్స్‌ దందా !

0

  • పోలీసులకు దొరక్కుండా సరికొత్త ప్లాన్‌ 
  • ఇద్దరిని అరెస్ట్‌ .. డ్రగ్స్‌, గంజాయి సీజ్‌

హైదరాబాద్‌లో సరికొత్త దందా బయటపడిరది. పోలీసుల నిఘా పెరగడంతో డ్రగ్స్‌, గంజాయి గ్యాంగ్‌లు రూటు మార్చాయి. ఫుడ్‌ డెలివరీ ముసుగులో కస్టమర్లకు గంజాయి, డ్రగ్స్‌ చేరుస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు. కొండాపూర్‌కు చెందిన మారం పవన్‌కుమార్‌, కొండాపూర్‌లో ఉంటున్న బిహార్‌కు చెందిన ఆదర్శ్‌ కుమార్‌సింగ్‌ స్నేహితులు. డ్రగ్స్‌, గంజాయి తీసుకునే క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిరది. బెంగళూరు నుంచి ఎండీఎంఏ , ఏపీ, ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయిని తీసుకొచ్చి కాలే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు విక్రయిస్తున్నారు.బెంగళూరు, ఏపీ, ఒడిశా సరిహద్దుల నుంచి రూ.1000కి గ్రాము చొప్పున తీసుకొచ్చి నగరంలో రూ.7 వేలకు అమ్ముతున్నారు. ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేసే ఆదర్శ్‌ ఫుడ్‌ తీసుకెళ్లే బ్యాగులో అడుగును డ్రగ్స్‌, గంజాయి పొట్లాలు పెడతాడు. ఫుడ్‌ పార్సిల్స్‌ ముసుగులో వాటిని అవసరమైన వారికి విక్రయిస్తున్నాడు. నిందితులు కొండాపూర్‌ శిల్పా పార్క్‌ ప్రధాన రహదారి దగ్గర విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు నిఘా పట్టి ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి నుంచి 21.788 గ్రా ఎండీఎంఏ, 874.316 గ్రా గంజాయి, 2 చిన్న డిజిటల్‌ తూకం యంత్రాలు, ఒక కారు, 3 మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌, గంజాయి విలువ రూ.8 లక్షలు ఉంటుందని చెబుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !