SV Zoo Park : తిరుపతి జూలో దారుణం...వ్యక్తిని చంపేసిన సింహం !

0


తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర జూ పార్కులో సింహం దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడు సింహం ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి దూకినట్లు తెలుస్తోంది. దీంతో సింహం అతనిపై దాడి చేయగా.. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చంపేసిన తర్వాత సింహం నోట కరుచుకుని వెళ్లినట్లుగా తెలిసింది. చనిపోయిన వ్యక్తిని రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్‌ గుర్జర్‌ (38)గా అధికారులు గుర్తించారు.అయితే చనిపోయిన వ్యక్తి గేటును దాటుకుని లోనికి వెళ్లి సింహాలకు ఆహారం వేసే ప్రాంతం నుంచి బోనులోకి దూకినట్లు సమాచారం. అయితే సెల్ఫీ దిగడానికి సింహాల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడు.. భయంతో చెట్టు ఎక్కి కింద పడినట్లు తెలుస్తోంది. సింహం నోటికి చిక్కడంతో బాధితుడి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు మృతదేహం లభ్యం కాలేదు. ఘటన తర్వాత జూ సిబ్బంది సింహాన్ని ఎన్‌‍క్లోజర్‌లో ఉన్న కేజ్‌లో బంధించారు. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్‌ పోలీసులు. డీఎస్పీ శరత్‌ రాజ్‌ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. తిరుపతిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర జూపార్కు ఆసియాలోనే అతి పెద్ద జూపార్కుగా గుర్తింపు పొందింది. సుమారు 1,250 ఎకరాల విస్తీర్ణంలో ఈ జూపార్కు విస్తరించింది. ఇందులో వందల రకాల జంతువులు, పక్షులు, సర్పాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు.. స్వామివారి పాదాల వద్ద కొలువైన జూపార్కును కూడా సందర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గురువారం కూడా పర్యాటకులు శ్రీ వెంకటేశ్వర జూపార్కు సందర్శనకు వెళ్లారు. అయితే సింహం దాడిలో వ్యక్తి చనిపోయిన ఘటన సందర్శకులను భయానికి గురిచేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !