the kerala story review : ది కేరళ స్టోరీ.. ఓటీటి రిలీజ్‌ .. మరి మెప్పించిందా?

0

వివాదాల నేపథ్యంలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన ‘ది కేరళ స్టోరీ’ ఎట్టకేలకు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి  సినిమా ఎలా ఉంది?

కథేంటంటే

షాలిని ఉన్ని కృష్ణన్‌ (అదాశర్మ), నీమ (యోగితా బిహాని), గీతాంజలి (సిద్ధి ఇద్నానీ) కేరళ కాసర్గడ్‌లోని నర్సింగ్‌ కాలేజీ విద్యార్థులు. వీరు ఉండే హాస్టల్‌ గదిలోనే ఆసిఫా (సోనియా బలాని) అనే మరో యువతి కూడా కలిసి ఉంటుంది. ఐసిస్‌లో అండర్‌ కవర్‌ అయిన ఆసిఫా అమ్మాయిలకు మాయమాటలు చెప్పి మతం మార్చే మిషన్‌లో పనిచేస్తుంటుంది. ఇందులో భాగంగా ఇద్దరు అబ్బాయిలను రంగంలోకి దింపి గీతాంజలి, షాలినిలు ప్రేమించేలా పథకం రచిస్తుంది. రమీజ్‌ ప్రేమలో పడిన షాలిని గర్భవతి అవుతుంది. పెళ్లి చేసుకోమని అడిగితే మతం మార్చుకుంటే వివాహం చేసుకుంటానని చెబుతాడు. దాంతో చేసేదేమీ లేక రమీజ్‌ను పెళ్లి చేసుకుని మతం మార్చుకుంటుంది. కొన్ని రోజులకు అతడు ముఖం చాటేయడంతో ఇసాక్‌ అనే మరో యువకుడితో కలిసి భారత్‌ నుంచి సిరియాకు వెళ్తుంది. అక్కడికి వెళ్లాక తాను మోసపోయానని తెలుసుకున్న షాలిని ఏం చేసింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? అక్కడి నుంచి ఎలా బయటపడిరది? ఆసిఫా మాటలు విన్న నీమ, గీతాంజలి ఏమయ్యారు?  అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే

వాస్తవ సంఘటనలు, సమాజంలో జరుగుతున్న అకృత్యాలు, అన్యాయాలను ప్రశ్నిస్తూ ఎన్నో చిత్రాలు వెండితెరపై మెరిశాయి. కొన్నేళ్ల క్రితం కేరళలో వందల సంఖ్యలో మహిళలు అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా యువతులే లక్ష్యంగా మత మార్పిడులను ప్రోత్సహించి ఐసిస్‌ వంటి ఉగ్ర సంస్థల్లోకి పంపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన ఈ సంఘటనల ఆధారంగా ‘ది కేరళ స్టోరీ’ని తీర్చిదిద్దడంలో దర్శకుడు సుదీప్తో సేన్‌ కొంతవరకూ విజయం సాధించారు. అఫ్గానిస్థాన్‌-ఇరాన్‌ బోర్డర్‌ సెక్యూరిటీకి పట్టుబడిన షాలినిని విచారిస్తున్న సన్నివేశంతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు..  అందుకు సంబంధించిన బ్యాక్‌ స్టోరీని చెబుతూ కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. (%్‌ష్ట్రవ సవతీaశ్రీa ర్‌శీతీవ తీవఙఱవష%) షాలిని, నీమ, గీతాంజలి నేపథ్యాన్ని చెబుతూ వాళ్లు నర్సింగ్‌ కాలేజ్‌లో చేరడం, హాస్టల్‌లో ఉన్న ఆసిఫాతో పరిచయం ఇలా నెమ్మదిగా వారి ప్రపంచానికి కనెక్ట్‌ అయ్యేలా కథను నడిపించాడు. అయితే, ఆ సన్నివేశాలన్నీ చాలా నెమ్మదిగా సాగుతాయి. దర్శకుడు ఉపయోగించిన నాన్‌ లీనియర్‌ స్క్రీన్‌ప్లే కారణంగా ఒకవైపు ఫ్లాష్‌ బ్యాక్‌ చెబుతూనే, వర్తమానంలో షాలిని విచారణను సమాంతరంగా నడపటం కాస్త గజిబిజిగా అనిపిస్తుంది. మన మంచి కోరుకునే స్నేహితుల్లా మన పక్కనే ఉంటూ సందర్భం వచ్చిన ప్రతిసారీ వారి మతాన్ని మనపై రుద్దడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? పార్టీలు, స్నేహితుల పేరుతో డ్రగ్స్‌కు ఎలా బానిసలుగా మారుస్తారు? వంటి సన్నివేశాలను వాస్తవానికి దగ్గర తీర్చిదిద్దిన విధానం బాగుంది. తియ్యని మాటల వెనక ఉన్న చేదు నిజాలను అర్థం చేసుకోలేని అమాయక మహిళలు సాలెగూడులో ఎలా చిక్కుకుపోతారో చాలా చక్కగా చూపించారు. షాలిని పరిస్థితులకు తలొగ్గి, మత పెద్దల మాటలకు కట్టుబడి పెళ్లి చేసుకోవడం, ఐసిస్‌ స్థావరానికి వెళ్లడం అక్కడ జరిగే అకృత్యాలు భరించలేక తప్పించుకునే ప్రయత్నాలు చేయడం తదితర సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. అయితే సహజత్వం, వాస్తవ పరిస్థితులను ఉన్నది ఉన్నట్లు చెప్పే ప్రయత్నంలో దర్శకుడు మరీ ఎక్కువ లిబర్టీ తీసుకున్నాడు. లిప్‌స్టిక్‌ రాసుకుందని మహిళ చేతులు నరకడం, షరియా చట్టాలను ఉల్లంఘించినందుకు తలలు తీసేయడం, మహిళలపై బలవంతపు అత్యాచారాలు ఇవన్నీ కాస్త శ్రుతిమించినట్లు అనిపిస్తాయి. ఐసిస్‌ స్థావరం నుంచి షాలిని తప్పించుకునే సీన్‌ కూడా మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. వాస్తవాలు చెప్పాలనుకున్న దర్శకుడి ప్రయత్నం బాగున్నా, ఒకే దృష్టి కోణం నుంచి సినిమా తీయడం, ఒక వర్గాన్నే కించపరిచేలా, వారంతా అలాంటివారే అన్నట్లు  చూపించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆయా సన్నివేశాల్లో దర్శకుడు రాజకీయ అవసరాల దృష్టి కోణం స్పష్టంగా కనిపిస్తుంది. బలమైన ఎమోషన్స్‌ మధ్య నడిపించాల్సిన సినిమాను ‘‘వాళ్లు అలా చేశారు? వీళ్లు ఇలా చేశారు’’? అంటూ షాలిని పాత్రతో చెప్పించడం నాణేనికి ఒకవైపు మాత్రమే చూపించినట్లు అనిపిస్తుంది. ( చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కలవాలి. ఒకవైపు తప్పు జరుగుతున్నట్లు చూపించడం సరికాదు. ఒకరి ట్రాప్‌లో పడి, మోసపోయిన తర్వాత లబోదిబోమనేకన్నా యువత ముందుగా ఎలా మేల్కొనాలో ఏదైనా పాత్ర ద్వారా చూపించి ఉంటే సినిమా అర్థవంతంగా ఉండేది. పిల్లలను తల్లిదండ్రులు ఎంత ప్రాణంగా ప్రేమిస్తారు? అలాంటి వారిని కాదని, వారి ఆశలను అడ్డంగా కూల్చేస్తూ హద్దులు దాటే వరకూ యువత వెళ్తోందంటే అందుక్కారణాలను కూడా ప్రస్తావించాల్సింది. ఇవేవీ దర్శకుడు ప్రస్తావించలేదు. మత్తు మందులు, క్షణికమైన సుఖాల కోసం యువత పెడదారి పట్టకుండా ఏం చేయాలో కూడా వివరంగా చూపించి ఉంటే సినిమాకు సార్థకత చేకూరేది.

ఎవరెలా చేశారంటే

షాలినిగా అదాశర్మ, నిమిషాగా యోగితా, గీతాంజలిగా సిద్ధి ఇద్నానీ వారి పాత్రలకు న్యాయం చేశారు. మోసపోయి మనోవేదన అనుభవించే సన్నివేశాల్లో ముగ్గురూ మంచి నటన కనబరిచారు. మిగిలిన వాళ్లెవరూ తెలుగువారికి పరిచయం లేరు. వాళ్లకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా బాగానే ఉంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ అన్నీ కుదిరాయి. యథార్థ సంఘటనల నుంచి స్ఫూర్తిపొంది దర్శకుడు సుదీప్తో సేన్‌ కథ, కథనాలను రాసుకున్నా, ఒక ఎమోషనల్‌ డ్రామాగా సినిమాను మలచాల్సింది పోయి, రాజకీయ దృష్టి కోణం నుంచి సినిమాను ప్రజెంట్‌ చేశారు.

(ఇది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !