MLC Kavitha : కవితకు 14 రోజుల రిమాండ్‌...తిహార్‌ జైలుకు !

0

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను రౌజ్‌ అవెన్యూ కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు హాజరుపరిచారు. ఈడీ తరఫు న్యాయవాది జోయబ్‌ హుస్సేన్‌ ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించారు. 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్‌ విడుదల అయ్యిందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడిరచారు. ఈ కేసులో కొందరిని అరెస్టు చేశామని.. మరికొందరిని ప్రశ్నిస్తున్నామని తెలిపింది. ఇప్పటికే 10 రోజులు ఈడీ కస్టడీలో ఉన్న కవితను..  కీలక అంశాలపై అధికారులు ఆరా తీశారు. లిక్కర్‌ స్కామ్‌లో రూ.వందకోట్ల ముడుపులపై ఈడీ ఆరాతీసింది. ఈ వ్యవహారాన్ని కవితే నడిపించారంటూ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. అయితే, కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, పిటీషన్‌ పై వివరణ ఇచ్చేందుకు ఈడీ సమయం కోరడంతో రౌస్‌ అవెన్యూ కోర్టు ఆర్టర్‌ ను రిజర్వ్‌ చేసింది. అనంతరం ధర్మాసనం కవితకు జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఏప్రిల్‌ 9 వరకు.. 14 రోజులపాటు కోర్టు కవితకు రిమాండ్‌ విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో కవితను అధికారులు తీహార్‌ జైలుకు తరలిస్తున్నారు. కాగా.. కవిత మధ్యంతర బెయిల్‌ పై విచారణను కోర్టు ఏప్రిల్‌ 1న చేపట్టనున్నట్లు న్యాయస్థానం వెల్లడిరచింది. 

వాదనలు ఇలా..

కవితని ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసుకున్నామని.. కొందరితో ఎదురు బొదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించామని ఈడీ కోర్టుకు తెలిపింది. వైద్య పరీక్షల నివేదికలు కవితకు అందజేయాలని కోరిన కవిత తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కవిత బెయిల్‌ పిటిషన్‌ మీద రిప్లై ఇచ్చేందుకు ఈడీ సమయం కోరింది. చిన్న కొడుకు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కవిత కోరారు. వచ్చే నెల 16 వరకు చిన్న కొడుకుకు పరీక్షలు ఉన్నాయని.. అప్పటి వరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరారు. వాదనల అనంతరం, కవిత అభ్యర్థనపై ఆర్డర్‌ రిజర్వ్‌ చేశారు.. జడ్జి కావేరి బవేజ.. ఈ క్రమంలో 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ కోరిన ఈడీ.. మధ్యంతర బెయిల్‌ మీద సైతం తమ వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరింది.

కవిత సంచలన వ్యాఖ్యలు..

కోర్టుకు హాజరవుతున్న క్రమంలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది తప్పుడు కేసు. మనీలాండరింగ్‌ కేసు కాదు.. పొలిటికల్‌ లాండరింగ్‌ కేసు. ఢల్లీి లిక్కర్‌ పాలసీ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటూ పేర్కొన్నారు. తాను క్లీన్‌గా బయటకు వస్తానని.. అప్రూవర్‌ గా మారనని పేర్కొన్నారు. నన్ను తాత్కాలికంగా జైలులో పెట్టవచ్చు. నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఇప్పటికే ఒక నిందితుడు జీజేపీలో చేరాడు. మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్‌ ఇస్తోంది. మూడో నిందితుడు రూ.50 కోట్లు బాండ్ల రూపంలో  జీజేపీకిు ఇచ్చాడు’’ అని పేర్కొన్నారు. జై తెలంగాణ.. జై కేసీఆర్‌ నినాదాలు చేస్తూ ఆమె కోర్టులోకి వెళ్లారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !