ED- KAVITHA : కవిత రిమాండ్‌ రిపోర్ట్‌లో కొత్త పేరు !

0

ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మరో మూడ్రోజులకు పొడిగించిన సంగతి తెలిసిందే. అటు సోదాలు.. ఇటు రిమాండ్‌ పొడిగింపు నేపథ్యంలో కవిత రిమాండ్‌ రిపోర్టును ఈడీ విడుదల చేసింది. ఈ రిపోర్టులో ఈడీ కీలక విషయాలను ప్రస్తావించింది. ఈడీ తాజా అఫిడవిట్‌తో మేకా శరణ్‌ అనే కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈయనపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన ఈడీ.. కవితను అడిగి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించింది. అయితే కవిత మాత్రం ఆయన వివరాలను చెప్పడం లేదని ఈడీ చెబుతోంది.  అతడు ఎవరో కాదు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అత్యంత దగ్గరి బంధువు మేకా శరణ్‌ కావటం గమనార్హం. ఇక.. కవిత ఇంట్లో జరిగిన సోదాల్లో శరణ్‌ ఫోన్‌ లభ్యం అయింది. సౌత్‌ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్‌దే కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవిత మేనల్లుడు మేకా శరణ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మేకా శరణ్‌ను ప్రశ్నించేందుకు పిలిస్తే రావడం లేదని ఈడీ పేర్కొంది.  గత ఏడు రోజులుగా కవిత విచారణకు సహకరించడం లేదని రిపోర్టులో ఈడీ తెలిపింది.

మేక శరణ్‌ పై ఫోకస్‌ !

కవిత బంధువు మేకా శరణ్‌పై ఈడీ ఫోకస్‌. లిక్కర్‌ స్కామ్‌లో సంపాదించిన అక్రమ సొమ్ము బదిలీ/ వినియోగంలో మేకా శరణ్‌ కీలక పాత్ర. ఏడు రోజుల రిమాండ్‌లో కవిత.. నాలుగు స్టేట్మెంట్లపై ప్రధానంగా ప్రశ్నించాం. ఫోన్‌లోని డేటా ఎందుకు డిలీట్‌ చేశారని అడిగాము. ఆదాయపు పన్ను వివరాలు, బంధువుల వ్యాపారాల వివరాలు అడిగాం. మేకా శరణ్‌ వివరాలు అడిగితే ‘నాకు తెలియదు’అని కవిత చెప్తున్నారు. ఢల్లీి లిక్కర్‌ కేసులో సంపాదించిన అక్రమ సొమ్మును కవిత బంధువు మేక శరణ్‌ బదిలీ చేశారు. ఇండోస్పిరిట్‌ ద్వారా ఈ అక్రమ సొమ్ము సంపాదించారు.  కవిత, మాగుంట శ్రీనివాస్‌ రెడ్డి, సమీర్‌ మహేంద్ర కలిసి కుట్రపన్ని ఇండో స్పిరిట్‌ ద్వారా అక్రమ సొమ్ము లావాదేవీలు చేశారు. మేకా శరణ్‌ ఈడీ ముందు హాజరు కావాలని ఫోన్‌ చేస్తే సహకరించడం లేదు. అందుకే ఆయన ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. కుటుంబ వ్యాపార వివరాలు, ఆర్థిక అంశాల పత్రాలు వివరాలు ఇవ్వాలని కోరాం. కవితను కుటుంబ సభ్యులు, న్యాయవాది కలిసే సమయంలో డాక్యుమెంట్స్‌ వివరాలను తెలియజేస్తానని చెప్పారు. ఇప్పటివరకూ ఎలాంటి డాక్యుమెంట్స్‌ అందించలేదు’ అని రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ విషయంలో సమీర్‌ మహేంద్రను కూడా ఇంటరాగేషన్‌ చేయబోతున్నాం. మేకా శరణ్‌కు అక్రమ సొమ్ము ఎలా బదిలీ చేశారు, వినియోగించారు అనేది తెలుసుకోవాలి. కొత్తగా వెలుగు చూస్తున్న ఈ విషయాల నేపథ్యంలో కవితను మరింత విచారణ చేయాలి’ అని ఈడీ రిమాండ్‌ పిటిషన్‌లోని కీలక విషయాలు వెల్లడిరచింది.

కవిత మేనల్లుడు మేక శరణ్‌ నివాసంలో ఈడీ సోదాలు

కవిత ఆడపడుచు అఖిల, మేనల్లుడు శరణ్‌ ద్వారా లావాదేవీలు జరిపినట్టు ఈడీ అనుమానం వ్యక్త చేస్తోంది. మేకా శరణ్‌ నివాసంలో  ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మేకా శరణ్‌ అందుబాటులో లేరు. ముడుపుల చెల్లింపులో శరణ్‌దే కీలక పాత్రగా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

కవిత తరపు న్యాయవాది వాదనలు.. 

‘ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కవిత డాక్యుమెంట్స్‌ ఎలా ఇస్తారు?. కవిత పిల్లలు మైనర్స్‌.. వారిని కలిసేందుకు అవకాశం ఇవ్వండి.  కస్టడీ పూర్తైన రోజే కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరపండి. కవితకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతున్నాం. బెయిల్‌ పిటిషన్‌ వేశాం. బెయిల్‌ పిటిషన్స్‌పై ఈడీకి ఆదేశాలు ఇవ్వండి’ అని కోర్టును కోరారు. అనంతరం ఈడీ తరపు న్యాయవాది జోయాబ్‌ హుసేన్‌ వాదనలు వినిపించారు. ‘కవిత ఈడీ విచారణకు సహకరించడం లేదు.మరో ఐదు రోజుల కస్టడీ కావాలి. నలుగురు స్టేట్మెంట్స్‌ గురించి కవితని అడిగాం. కిక్‌ బ్యాగ్స్‌ గురించి అడిగాం. ఫోన్ల డేటా డిలీట్‌ చేశారు. కుటుంబ ఆదాయపు పన్ను, వ్యాపారాల వివరాలు అడిగాం. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. మేకా శరణ్‌కి సంబంధించి సమాచారం ఇవ్వడం లేదు. సమీర్‌ మహేంద్ర కూడా కవిత బినామీనే. కవితతో కలిపి సమీర్‌ను విచారించాలి. లిక్కర్‌ స్కాంలో రూ. వందల కోట్లు చేతులు మారాయి.  ఇప్పటికీ ఇంకా సోదాలు జరుగుతున్నాయి.  కవితకు వైద్య సూచనల మేరకు మందులు, డైట్‌ ఇస్తున్నాము’అని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు  విన్న కోర్టు కవితను మరోమూడు రోజులు ఈడీ కస్టడీ పొడిస్తున్నట్లు ఆదేశించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !