Vishwak Sen : ఎన్ని సార్లు క్రిందికి లాగినా రెట్టింపు ఉత్సాహంతో పైకి లేస్తా !

0

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌, చాందినీ చౌదరి జంటగా వచ్చిన లేటెస్ట్‌ మూవీ గామి. మహాశివరాత్రి కానుకగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ హిట్‌ గా నిలిచింది. కొత్త దర్శకుడు విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. సరికొత్త కథా, కథనాలతో విజువల్‌ వండర్‌ గా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు చాలా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. ఇక కలెక్షన్స్‌ కూడా అదే రేంజ్‌ వస్తున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌ బస్టర్‌ దిశగా దూసుకుపోతోంది గామి. దీంతో చిత్ర యూనిట్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

రేటింగ్‌ దెబ్బతీయాలని చూస్తున్నారు

ఇదిలా ఉంటే.. అయితే, సినిమా విడుదలైనప్పటి నుంచి కొందరు తక్కువ రేటింగ్‌ ఇస్తున్నారని చిత్రబృందం పోస్ట్‌లు పెడుతోంది. ఈ వ్యవహారంపై విశ్వక్‌ ఇన్‌ స్టా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఓ నోట్‌ విడుదల చేశారు. ‘‘గామి’ని ఇంతపెద్ద హిట్‌ చేసినందుకు ప్రేక్షకులకు, సినీ ప్రియులకు  ధన్యవాదాలు. దీని రేటింగ్‌ విషయంలో నా దృష్టికి వచ్చిన సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నా. కొందరు ఈ చిత్రానికి 10కు 1 రేటింగ్‌ ఇచ్చి దెబ్బతీయాలని చూస్తున్నారు. రకరకాల యాప్స్‌ సహకారంతో ఫేక్‌ రేటింగ్‌ ఇవ్వడం వల్ల 9 ఉన్న రేటింగ్‌ ఒకటికి పడిపోయింది. మీరు ఎన్నిసార్లు  కిందికి లాగినా రెట్టింపు ఉత్సాహంతో పైకి లేస్తాను. ఇలాంటి పనులు ఎవరు, ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ, ఎలాంటి సందర్భంలోనైనా మంచి సినిమాను ప్రేక్షకులు  ఆదరిస్తారని మరోసారి రుజువైంది. ‘గామి’ని సపోర్ట్‌ చేస్తోన్న ప్రేక్షకులకు, మీడియాకు థ్యాంక్స్‌. ఈ వ్యవహారంపై చట్టపరంగా ముందుకు వెళ్తాను’ అని రాసుకొచ్చారు.  విశ్వక్‌ అఘోరాగా కనిపించిన ఈ చిత్రంతో విద్యాధర్‌ కాగిత దర్శకుడిగా పరిచయం అయ్యారు.  ఒక మంచి ప్రయత్నానికి సపోర్ట్‌ చేసిన ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నాము.. భం భోలే నాధ్‌ .. జైహింద్‌.. అంటూ రాసుకొచ్చాడు విశ్వక్‌. ప్రస్తుతం విశ్వక్‌ చేసిన ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !