UPSC: సివిల్స్‌ 2023 తుది ఫలితాలు విడుదల !

0

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) సివిల్స్‌ 2023 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తంగా 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంక్‌, అనిమేష్‌ ప్రధాన్‌కు రెండో ర్యాంక్‌, దోనూరి అనన్యరెడ్డికి మూడో ర్యాంక్‌, పీకే సిద్ధార్థ్‌ రామ్‌ కుమార్‌కు నాలుగో ర్యాంకు, రుహనీకి  ఐదో ర్యాంకు దక్కింది. జనరల్‌ కేటగిరిలో 347, ఈడబ్ల్యూఎస్‌లో 116, ఓబీసీలో 303, ఎస్సీ కేటగిరిలో 165, ఎస్టీ కేటగిరిలో 86 మంది ఎంపిక అయ్యారు. వరంగల్‌కు చెందిన ఇద్దరు సివిల్స్‌కు సెలెక్ట్‌ అయ్యారు. పరీక్షలు రాసిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌ సైట్‌  www.upsc.gov.in లో మెరిట్‌ లిస్ట్‌ ను చెక్‌ చేసుకోవచ్చు. మొత్తం 1016 మంది అభ్యర్థుల నియామకానికి అర్హత సాధించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్‌ నంబర్లను యూపీఎస్సీ విడుదల చేసింది.

వివిధ దశల్లో ...వడపోత !

యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష 2023 మే 28న జరిగింది. ప్రిలిమ్స్‌ రౌండ్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 2023 సెప్టెంబర్‌ 15, 16, 17, 23, మరియు 24 తేదీల్లో జరిగిన మెయిన్స్‌ పరీక్షకు హాజరయ్యారు. మెయిన్స్‌ ఫలితాలు డిసెంబర్‌ 8న విడుదలయ్యాయి. యూపీఎస్సీ ఇంటర్వ్యూలు 2024 జనవరి 2 నుంచి ఏప్రిల్‌ 9 మధ్య దశలవారీగా జరిగాయి. నేడు సివిల్స్‌ తుది ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 1016 మందిని ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌), ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఐపీఎస్‌), ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌)తో సహా వివిధ కేంద్ర ప్రభుత్వ సేవలు మరియు విభాగాలలో ఈ ఖాళీలను భర్తీ చేస్తుంది. ఐపీఎస్‌కు 200 మంది, ఐఏఎస్‌కు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు. సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ ఎ కేటగిరీలో 613 మంది, గ్రూప్‌ బి సర్వీసెస్‌లో 113 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడిరచింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 1105 ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !