ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల సంఘం రాబొయ్యే ఎన్నికలు కూటమికి అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి విడత లో జరగాల్సిన ఎన్నికలు, కూటమికి అనుకూలంగా ఉండే విధంగా నాల్గవ దశలో ఏర్పాటు చెయ్యడమే కాకుండా, పోలీస్ అధికారులు, ఎన్నికల నిర్వహణ అధికారులను కూడా కూటమికి అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుతం 22 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసారు. ఇది ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. సీఎం జగన్ కి ఈ ఐపీఎస్ అధికారులు సహకరిస్తున్నారు అనే నెపంతో ఈసీ వారిని సస్పెండ్ చేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా వాలంటీర్ల చేత జరుగుతున్న పనులను ఆపించడం కూడా కూటమికి అనుకూలంగా వ్యవహరించిన తీరులలో ఒకటని అంటున్నారు. టీడీపీ, జనసేన ఇందుకోసమే బీజేపీ పార్టీ తో పొత్తు పెట్టుకున్నారని, వ్యవస్థలను మ్యానేజ్ చెయ్యడం లో బీజేపీ పార్టీ కి ఎదురే లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అందుకే చంద్రబాబు కోరిమరీ బీజీపీతో పొత్తు పొట్టుకున్నారు అని అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు.