Maheshwar reddy : రేవంత్‌రెడ్డికి రూ.300 కోట్ల ముడుపులు !

0

  • బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
  • రేవంత్‌కు హెటిరో రూ. 300 కోట్లు ఇచ్చింది
  • వాటిని ఆయన ఢల్లీి నాయకులకు పంపారు
  • రాష్ట్రంలో ఆర్‌ ట్యాక్స్‌ దందా జోరుగా నడుస్తోంది
  • సెటిల్మెంట్లు, బ్లాక్మెయిల్స్‌ చేస్తున్నారని విమర్శలు

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఆర్‌ ట్యాక్స్‌ పాలసీ’ పేరుతో రేవంత్‌ సర్కార్‌ భారీగా వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇప్పటికే హెటిరో నుంచి రూ.300 కోట్ల దాకా రేవంత్‌కు ముట్టాయని అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కేటాయించిన భూములను తమ ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం మీడియాకు తెలియజేశారు. నగరంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ పార్థసారథి రెడ్డికి చెందిన హెటిరో కంపెనీకి గత ప్రభుత్వం 15 ఎకరాల భూమిని 30 సంవత్సరాల లీజుకు అప్పగించిందని తెలిపారు. రూ. 1500 కోట్ల విలువ చేసే భూమిని ఎకరాకు రూ. 2 లక్షల చొప్పున లీజుకు ఇచ్చిందన్నారు. ఈ లోపు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక జీవో 12 ప్రకారం లీజు క్యాన్సిల్‌ చేశారని మహేశ్వర్‌ రెడ్డి చెప్పారు. అయితే కొన్నిరోజులకు జీవో 37 పేరుతో మరోసారి ఆ భూమిని హెటిరోకి రేవంత్‌ సర్కార్‌ కేటాయించిందన్నారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి సుమారు రూ. 50 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని.. అయినా రూ. 15 లక్షల రూపాయలకు కేటాయించారని పేర్కొన్నారు. ఈ మొత్తం లావాదేవీలో రూ. 300 కోట్లను హెటిరో నుంచి రేవంత్‌ రెడ్డి తీసుకున్నారని, ఆ డబ్బును ఢల్లీికి పంపారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ లొసుగులను తన సెటిల్‌మెంట్స్‌కు రేవంత్‌ రెడ్డి వినియోగించుకుంటున్నారని మహేశ్వర్‌ రెడ్డి తెలిపారు. కాళేశ్వరాన్ని సీబీఐకి అప్పగించకపోవడం వెనక ఉన్న కారణం ఇదేనన్నారు. మరికొన్ని రోజుల్లో ఆధారాలతో సహా మరొక అంశాన్ని బయటపెడతానని మహేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, సీఎం రేవంత్‌ రెడ్డి దగ్గరకి వెళ్లిన నాయకులు ‘‘నీ వంతుకు రేటెంత రెడ్డి?’’ అని అడుగుతున్నారని మహేశ్వర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. రేటెంత రెడ్డిది, రేట్‌ ఎవరు ఫిక్స్‌ చేస్తున్నారో తెలీదన్నారు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయని, రేవంత్‌ ట్యాక్స్‌, భట్టి ట్యాక్స్‌ ఏక్కువయ్యాయని మహేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !