నాటు నాటు...సాంగ్‌కు గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డ్‌ !

0

ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డు RRR  చిత్రాన్ని వరించింది. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ ఈ అవార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ పాట వెనుక చిత్రబృందం ఎంతో కష్టపడిరది. ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ రావడంతో చిత్రబృందం, భారతీయ సినీ ప్రియులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు సినిమా జక్కన్నగా పేరొందిన రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అందించిన స్వరాలకు చంద్రబోస్‌ చక్కటి తెలుగు పదాలతో సాహిత్యం అందించారు. ఇక రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవలు తమ గానంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు.  ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ చేశారు. మరోవైపు ఈ పాట ‘ఆస్కార్‌’ షార్ట్‌లిస్ట్‌లోనూ ఉత్తమ సాంగ్‌ విభాగంలో చోటు దక్కించుకుంది.  ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఆ ఓటింగ్‌ ఆధారంగా జనవరి 24న ఆస్కార్‌ నామినేషన్‌లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. అనంతరం మార్చి 12న విజేతలకు ఆస్కార్‌ అవార్డులు అందించనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !