ఉరి ద్వారా చంపటం క్రూరమైన చర్య... ప్రత్యామ్నాయ మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు ఆరా !

0


ఉరి వేస్తే నొప్పి వస్తుంది. మరి మరణశిక్ష పడ్డ వాళ్లను ఎలా శిక్షించాలి. నొప్పి లేకుండా ప్రాణాలు తీసేందుకు.. ఉరి కాకుండా ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా. ఈ అంశంపై ఇవాళ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కొన్ని తీవ్రమైన కేసుల్లో కోర్టులు మరణశిక్ష విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మెడకు ఉరి వేసి చంపడం కన్నా.. నొప్పి లేనటువంటి ఇతర పద్ధతుల్లో ప్రాణాలు తీసే వీలు ఉందా అని ఇవాళ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మెడకు ఉరి వేసి శిక్షించడం కన్నా.. తక్కువ స్థాయిలో నొప్పితో చనిపోయే పద్ధతుల గురించి సమాచారాన్ని సేకరించి, ఆ అంశాన్ని చర్చించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఉరిశిక్ష ప్రభావం గురించి స్టడీ చేసి రిపోర్టు ఇవ్వాలని అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణిని సుప్రీంకోర్టు కోరింది. ఈ అంశంపై నిపుణుల కమిటీ వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. మరణశిక్ష పడ్డవాళ్లకు నొప్పి లేకుండా చావును ఇవ్వాలన్న అంశంపై దాఖలైన పిటిషన్‌ విచారణ నేపథ్యంలో కోర్టు ఈ అంశాన్ని పేర్కొంది. ఉరికి బదులుగా తుపాకీతో కాల్చడం, ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇవ్వడం, ఎలక్ట్రిక్‌ షాక్‌ లాంటి పద్ధతులను అమలు చేయాలంటూ పిటీషన్‌లో సూచించారు.మెడకు ఉరి వేసి చంపడం అనే చాలా క్రూరమైన పద్ధతి అని లా కమీషన్‌ లాయర్‌ రిషి మల్హోత్రా తెలిపారు. ఇది చాలా ఆలోచించాల్సిన అంశమే అని, కానీ దీనిపై సైంటిఫిక్‌ డేటా అవసరమని, నొప్పుల గురించి స్టడీ చేసిన డేటా ఇవ్వాలని, త్వరలో కమిటీని ఏర్పాటు చేస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. ఈ కేసు విచారణను మే 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.

కేసు విచారణ సమయంలో.. వివిధ రకాల మరణాల గురించి జడ్జీలు డిస్కస్‌ చేశారు. అమెరికాలో లీథల్‌ ఇంజెక్షన్‌ ఇచ్చి శిక్ష విధించే పద్ధతి అమలులో ఉన్నా.. ఆ పద్ధతిలో కూడా నొప్పి ఉన్నట్లు జస్టిస్‌ పీఎస్‌ నర్సింహా అభిప్రాయపడ్డారు. ఇంజెక్షన్‌ ద్వారా చంపడమూ నొప్పే అని, ఇక షూటింగ్‌ అంటే అదో మిలిటరీ గేమ్‌ అవుతుందని, ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘించినట్లే అని సీజేఐ చంద్రచూడ్‌ అన్నారు. ఒకవేళ ప్రాణాంతక ఇంజెక్షన్‌ విధానాన్ని ఆశ్రయిస్తే, అప్పుడు ఎటువంటి కమికల్‌ వాడాలన్న దానిపై రీసర్చ్‌ చేయాలని జడ్జిలు అభిప్రాయపడ్డారు. ఉరి తీయడాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటిస్తే, అప్పుడు ఇతర పద్ధతుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుందని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !