AP INTER RESULTS OUT : ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాల విడుదల

0

 

విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌తో పాటు, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఈ ఏడాది ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ కలిపి 10,03,990 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. వారిలో 4,84,197 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు కాగా, 5,19,793 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. పరీక్షలు ముగిసిన 22 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు.  ఫస్టియర్‌లో 2, 66, 326 మంది.. సెకండ్‌ ఇయర్‌లో 2,72,001 మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. ఫస్టియర్‌ ఉత్తీర్ణత 61 శాతం ఉండగా.. సెకండ్‌ ఇయర్‌లో 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. పూర్తి పారదర్శకంగా పరీక్షల నిర్వహణ, స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడిరచారు. ఈ ఏడాది పరీక్షలు జరిగిన 22 రోజుల్లోనే ఇంటర్మీడియట్‌ బోర్డు ఫలితాలను విడుదల చేసింది.మొదటి సంవత్సరం బాలికలు 65 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 58 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలా రెండో సంవత్సరం బాలికలు 75 శాతం.. బాలురు 68 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి ప్రకటించారు. ఈ నెల 27వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ ఎంవి శేషగిరిబాబు, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌, జగనన్న గోరుముద్ద డైరెక్టర్‌ నిధి పాల్గొన్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లలో చెక్‌ చేసుకోవచ్చు. http://examresults.ap.nic.in/,    http://resultsbie.ap.gov.in 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !