- ఆగష్టు 17న దళవాయి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం !
- సహచర మిత్రుల ఆచూకీ కోసం ఎడతెగని ప్రయత్నం !
విజయవాడలోని విద్యాదర్పణం ఏరియాలోని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ (డీఎస్‌ఎంసిహెచ్) 1992`93 విద్యా సంవత్సరానికి చెందిన 10 వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆగష్టు 17, 2025 న జరుగనుందని ఆహ్వాన కమిటీ సభ్యులు తెలిపారు. ఆ బ్యాచ్‌కు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఎక్కడ ఉన్నా తప్పనిసరిగా పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి హాజరుకావలసినదిగా పిలుపునిచ్చారు. రీ యూనియన్ నిర్వహణకు ఇప్పటికే ఒకసారి జూలై 3, 2025 మొదటి విడత సమావేశం నిర్వహించినట్లు నిర్వహకులు దాది మహేష్, అన్నవరపు మురళి, గోమతోటి వినోద్‌పాల్, ఆర్.టి.సి. నాగరాజు, శ్రీను మరియు టి.కె.ఎన్.వి. ప్రసాద్ తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని భవానిపురం, స్వాతి రోడ్‌లో గల క్యాసరోల్ రెస్టారెంట్ నందు ఉదయం 10 గం॥ల నుండి మొదలవుతుందని తెలిపారు.
దళవాయి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఈ కార్యక్రమాన్ని ముందుడి నడిపిస్తున్న దాది మహేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు దాదాపు 60 కిపైగా సభ్యులు అందుబాటులోకి వచ్చారు. మిగిలిన అందుబాటులోకి రాని మిత్రులకు వార్తపత్రికలు, సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ప్రచారం ద్వారా తెలుసుకుని 99598 33139, 77803 79068 నంబర్ల నందు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే చదువు నేర్పిన గురువులైన అన్నవరపు బాబురావు గారు, శోభనా చలపతిరావు గారు, రామరాజు గారు, విల్సన్ గారు, రaాన్సీ గార్లను కలిసి కార్యక్రమానికి ఆహ్వానించటం జరిగిందన్నారు. చిన్న నాటి మిత్రులను కలసి ఆనందంగా గడపాలని, అలనాటి మరుపురాని రోజులను మరోసారి నెమరువేసుకోవాలని ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. మిగిలిన మిత్రులు కూడా అందుబాటులోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినది కోరుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ (డీఎస్‌ఎంసిహెచ్) బాలాజీ ఆరేపల్లి గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేయనున్నారని తెలిపారు.